AP Polling Percentage till 11AM: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం, హింసాత్మక ఘటనలతో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ 23.4 శాతంగా నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఓటు వేసిన వారిలో మహిళలు 24.17 శాతం, పురుషులు 23.68 శాతం ఉన్నారు.


నంద్యాలలో 25.85, శ్రీశైలంలో 22.80 శాతం, డోన్ లో 23.30 శాతం, నందికొట్కూరులో 20.36 శాతం ఓటింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కర్నూలులో 22.05, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 18.61 శాతం, అనకాపల్లిలో 19.75 శాతం, అనంతపురంలో 23.9, అన్నమయ్యలో 22.28 శాతం, బాపట్లలో 26.88, చిత్తూరులో 28. 82 శాతం పోలింగ్ నమోదైంది. 


అలాగే కోనసీమ జిల్లాలో 26.74 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 21.75, ఏలూరులో 24.28, గుంటూరులో 20.84 శాతం ఓటింగ్ నమోదైంది. కాకినాడలో 21.26 శాతం, క్రిష్ణా జిల్లాలో 25.84 శాతం చొప్పున ఓటింగ్ శాతం నమోదు అయింది. ఎన్టీఆర్ జిల్లాలో 21.39, పల్నాడు జిల్లాలో 23.25 శాతం చొప్పున పోలింగ్ నమోదు అయింది.