అన్వేషించండి

Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Balakrishna Birthday | నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
  • సినీ, రాజకీయ, సామాజిక రంగాల సేవలను సీఎం నాయుడు కొనియాడారు.
  • బసవతారకం, హిందూపురం నియోజకవర్గ సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
  • ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు.

Happy Birthday Balakrishna | అమరావతి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ సినీ, రాజకీయ, సామాజిక రంగాల్లో సాధిస్తున్న విజయాలను కొనియాడుతూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. బాలకృష్ణను తన ఆప్తుడిగా పేర్కొంటూ ఆయన ప్రస్థానాన్ని అభినందించారు.

"సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు" అని చంద్రబాబు విషెస్ తెలిపారు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ కోట్ల మందిని అలరిస్తున్న బాలకృష్ణ.. ఇటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేయడం అభినందనీయమని కొనియాడారు.

ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, మరోవైపు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ బాలకృష్ణ సాగిస్తున్న జీవనయానం నిరంతరాయంగా కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ భగవంతుడు బాలయ్యకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ... నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆయనపై కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Also Read: Balakrishna: రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్

బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరపై మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు మరిన్ని అద్భుతమైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. బాలకృష్ణకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఎనలేని సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆత్మీయ పోస్ట్ చేశారు

Also ReadBharathiraja Passed Away - బ్రేకింగ్ న్యూస్... సీనియర్ తమిళ్ దర్శకుడు భారతీరాజా మృతి - కోలీవుడ్‌లో విషాదం 

 

Frequently Asked Questions

నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు ఎవరు తెలిపారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ఏ విధంగా ప్రశంసించారు?

బాలకృష్ణ సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నారని చంద్రబాబు కొనియాడారు. ప్రజాసేవలోనూ ఆయన ముద్ర వేశారని పేర్కొన్నారు.

బాలకృష్ణ ఏ సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు?

బాలకృష్ణ తన మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా సేవ చేస్తున్నారు. అలాగే హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు ఏమని శుభాకాంక్షలు తెలిపారు?

పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు కథానాయకుడిగా మరిన్ని విజయాలు, ప్రజాప్రతినిధిగా మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget