BJP Vishnuvardhan Reddy : అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసేందుకు  దేశ ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురు చూస్తున్నారు. అందుకే దేశంలోని పలు ప్రభుత్వాలు 22వ తేదీన సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా హాఫ్ డే సెలవు ప్రకటించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తోంది. దేశంలో అత్యంత కీలకమైన ఘట్టం విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణం 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.             


అయోధ్యరాముడి ఆలయ ప్రారంభోత్సవం గురించి  ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా శ్రీరామచంద్రుడ్ని ఆరాధిస్తారు.. పూజిస్తారన్నారు.  ఈ సందర్భంగా ఓ పవిత్రమైన కార్యక్రమం సందర్భంగా దేశ ప్రజలందరూ భాగం కావాలని కేంద్రం పిలుపునిచ్చింది.  దానికి తగ్గట్లుగా కొన్ని నిర్ణయాలు తసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మందికి రామ మందిర ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించేందుకు ఆ రోజును సెలవుగా ప్రకటించాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి హిందువుల మనోభావాలను గుర్తించాలని విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తరహాలో రామ మందిరం వైభవాన్ని ప్రజలందరూ చూసే ఏర్పాట్లు చేయలని ఆయన కోరారు.         


స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది.  కి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సెలవులను మరో మూడ్రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.           


దేశంలో గొప్పగా జరగబోతోన్న ఈ వేడుకలకి యూపీ, గోవా, చత్తీస్‌ఘడ్,  మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, జనవరి 22 న అందరూ  పండుగ జరుపుకోవాలని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.     రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తోంది.