Bharat Ratna Vajpayee 100th birth anniversary celebrations : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ 'అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర'ను సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు డిసెంబర్ 11 నుంచి 25 వరకు కొనసాగనున్న ఈ యాత్ర, వాజ్‌పేయి సుపరిపాలనా సిద్ధాంతాలను, ప్రధానమంత్రి మోదీ భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచ నాయకుడిగా మార్చే లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి రూపొందించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేశారు.
ఈ యాత్ర ప్రధానంగా వాజ్‌పేయి గారి పాలనా విజయాలను ప్రచారంచేస్తారు. అలాగే మోదీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా మార్చే 'వికసిత భారత్ 2047' దృష్టిని ప్రజలకు చేరవేయాలనే లక్ష్యం. బీ ఈ యాత్ర ఎన్‌డీఎ ఐక్యతను బలోపేతం చేస్తూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని పెంచడానికి కీలకమని నాయకులు చెప్పారు. ఈ యాత్రలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. యాత్ర ధర్మవరం నుంచి ప్రారంభమై, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను కవర్ చేస్తూ డిసెంబర్ 25న అమరావతిలో ముగుస్తుంది - ఆ రోజు వాజ్‌పేయి జన్మదినం. రోజుకు రెండు జిల్లాలు కవర్ చేస్తూ మొత్తం 15 రోజులు జరుగుతుంది. మొదటి దశలో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు; తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదలైనవి. మూడు ప్రత్యేక బస్సుల్లో యాత్ర సాగుతోంది. ప్రతి జిల్లాలో వాజ్‌పేయి విగ్రహాలు ఆవిష్కరించిపబ్లిక్ మీటింగులు నిర్వహిస్తారు.
ధర్మవరం - రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వరాజ్య కేంద్రం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. సత్యకుమార్ యాదవ్ సేవా ట్రస్ట్ 'సంస్కృతి' ద్వారా 2,000 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.2.6 లక్షల ఫీజులు చెల్లించారు. డిసెంబర్ 25న అమరావతిలో గ్రాండ్ మీటింగ్‌తో యాత్ర ముగుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, ఎన్‌డీఎ నాయకులు పాల్గొంటారు.