Vishnu Vs Gudivada : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి గుడివాడ  అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే ..  కుటుంబ, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం నీ, మరియు మీ పార్టీ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని  మడిపడ్డారు. 


రాజకీయ విమర్శలకు వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను ప్రస్తావిస్తారా ?             


రాజకీయ విమర్శలు చేసినప్పుడు వాటికి రాజకీయంగానే సమాధానం చెప్పాలన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం ఆదాయం రావడం లేదా అని అమర్నాథ్ ప్రశ్నించారని  కానీ   ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాలేదన్నారు.  విషపూరితమైన సొంత మద్యం బ్రాండ్లు పెట్టి అవే కొనాలని ప్రజల్ని దోచుకోవడం లేదని..   మందు బాబుల్ని తాకట్టు పెట్టి ఏ రాష్ట్రంలోనూ రూ. యాభై వేల కోట్ల అప్పులు చేయలేదన్నారు.  ల్వే జోన్ గురించి మాట్లాడుతున్న గుడివాడ అమర్నాథ్ ..  భూములు ఇవ్వలేదనే విషయాన్ని ఒప్పుకున్నారు . ముందు భూములు ఇప్పించి మాట్లాడాలని చాలెంజ్ చేశారు.  


పురందేశ్వరి చేసిన విమర్శలకు సమాధానం లేకనే ఎదురుదాడి ! 


అప్పులకు తగ్గ ఆస్తులను సృష్టిస్తున్నామని అమర్నాథ్ గారు చెప్పారు. మాటలు కాదు..  లెక్కలు చూపించి మాట్లాడాలి. మీ బడ్జెట్ లెక్కల్లోనే అసలు ఎలాంటి ఆస్తుల సృష్టి జరగడం లేదని మీరే చెబుతున్నారన్నారు.  ఏపీ బీజేపీ.. మీ ప్రభుత్వ అప్పుల నిర్వాకాలన్నిటినీ లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచింది. ముందు వాటికి సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు.    డబ్బులు తీసుకుని  దారి మళ్లించారని .. జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం డబ్బులిస్తూంటే.. ఒక్క రూపాయి తీసుకోవడం చేతకాలేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పిందన్నారు.                            


బహిరంగ చర్చకు రావాలని మంత్రి అమర్నాథ్‌కు  విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ 


రాష్ట్రానికివస్తున్న పరిశ్రమలు కనిపించడం లేదా అనిపెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతకరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చూసినా ఒక్క పరిశ్రమ కూడా కనిపించడం లేదన్నారు.  అడ్డగోలుగా భూములు దోచి పెట్టిన ఒప్పందాలే కళ్ల ముందు  కనిపిస్తున్నాయి. తరిమికొట్టిన భారీ పరిశ్రమలే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పెట్టుబడులు పెట్టారో మరి. అక్కడొస్తున్నాయి.. ఇక్కడొస్తున్నాయి అని పిట్టకథలు కాదు.. నాలుగున్నరేళ్లు అయింది.. ఎన్ని తెచ్చారో చూపించండి...లేకపోతే మీది చేతకాని తనమని మండిపడ్డారు.  డ్డగోలు అవినీతి, అప్పుల్లోనూ అక్రమాలు, చేతకాని పరిపాలన చేసిన ప్రభుత్వం ఏపీ కాదు...భారత దేశ చరిత్రలోనే లేదు.  చేతనైతే పురందేశ్వరి దేవి గారు అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రజలముందు విడుదల చేయండి , లేదు మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే  బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.