AP Assembly Review : ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగాయి.ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అధికార,ప్రతిపక్షాలు ఎవరికి వారే పైచేయి సాధించేందుకు ట్రై చేసారు.టీడీపీ సభ్యులు సభ జరిగినన్ని రోజులు కూడా సస్పెండ్ అయ్యారు.ప్రభుత్వ పథకాలు,రాష్ట్ర అభివృద్ది సీఎం జగన్ స్వయంగా సభకు వివరించారు.ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
తొలి రోజు వికేంద్రీకరణపై సీఎం జగన్ ప్రజెంటేషన్
15 నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు వాడివేడిగా ముగిసాయి.శాసనసభతో పాటు మండలిలో కూడా అధికార,ప్రతిపక్షాల మధ్య మాటలయుద్దం జరిగింది.టీడీపీ సభ్యులు ప్రతిరోజూ ఏదో ఒక సమస్యపై వాయిదా తీర్మానం ఇవ్వడం...దాన్ని స్పీకర్ తిరస్కరించడం చేసారు.టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుపట్టడం,పోడియం వద్ద నిరసన తెలపడంతో వరుసగా ఐదు రోజులు కూడా సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే వికేంద్రీకరణపై సీఎం జగన్ సుదీర్ఘంగా వివరించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వికేంద్రీకరణతో పాటు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్దిని వివరించారు ముఖ్యమంత్రి.అమరావతి నిర్మాణం వల్ల లక్షా 20 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చిన సీఎం....విశాఖను పదివేల కోట్లతోనే రాజధానిగా మార్చవచ్చని అన్నారు.రైతులతో పాదయాత్ర చేయిస్తుంది చంద్రబాబు అని ఆరోపించారు.మూడు రాజధానుల బిల్లుపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ....వికేంద్రీకరణతోనేో ముందుకెళ్తామని స్పస్టం చేసారు సీఎం.మొదటిరోజు ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో కాసేపటికే వారిని సస్పెండ్ చేసారు
పారిశఅరామిక ప్రగతి, ఆర్థిక వ్యవస్థపై సుదీర్ఘమైన ప్రసంగాలు
ఇక రెండో రోజు రాష్ట్రంలో ఆర్ధిక ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది.11.43 శాతంతో జీఎస్డీపీలో దేశంలోనే మొదటిస్థానంలోనే నిలిచిందన్నారు సీఎం జగన్.చంద్రబాబు హయాంలో కంటే మెరుగైన ఆర్ధిక వృద్ది సాధించినట్లు చెప్పుకొచ్చారు.రాష్ట్రం అసాధారణ అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు అనవసర విమర్శాల్లో అర్ధం లేదన్నారు.చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు,ప్రస్తుతం మూడున్నరేళ్లలో చేసిన అప్పులపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు సీఎం. మూడో రోజు సమావేశాల్లో పోలవరం ప్రాజెక్ట్ పై ప్రశ్నోత్తరాల్లో గందరగోళం జరిగింది.నిర్వాసితులకు పరిహారం విషయంలో మంత్రి అంబటికి ప్రతిపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో మధ్యలోనే జోక్యం చేసుకున్నారు సీఎం.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది అనేది పీపీటీ ద్వారా వివరించారు.టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఆరోపించారు సీఎం.నిర్వాసితులకు గతంలో ఇచ్చిన పరిహారానికి కలిపి మొత్తం 10లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు.వివిధ పథకాలకు వేలకోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం...పోలవరం పరిహారం కోసం 500 కోట్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదన్నారు పారిశ్రామికాభివృద్దిపై సీఎం సభలో స్టేట్ మెంట్ ఇచ్చారు.కేంద్రం ఇస్తున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రాష్ట్రంకు రాకుండా యనమల రామకృష్ణుడు లెటర్ లు రాయడాన్ని ప్రస్తావించారు సీఎం.
పెగాసస్‌పై హౌస్ కమిటీ రిపోర్ట్ సభలో ప్రవేశ పెట్టిన భూమన
నాలుగోరోజు సభలో డేటా చౌర్యంపై హౌస్ కమిటీ మధ్యంతర నివేదిక ప్రవేశపెట్టింది.సేవామిత్ర యాప్ ద్వారా ఓట్ల తొలగింపుకు టీడీపీ ప్లాన్ చేసిందంటూ చైర్మన్ భూమన సభకు వివరించారు. అయితే ఇదంతా ఫేక్ రిపోర్ట్ అంటూ కొట్టిపారేసారు టీడీపీ సభ్యులు. అయితే రిపోర్ట్ ద్వారా కొండను తవ్వి కనీసం చీమను కూడా పట్టలేకపోయారని ఆరోపించారు టీడీపీ సభ్యులు. విద్య,వైద్య రంగాల్లో నాడు-నేడుపై సీఎం సభలో వివరించారు.నారావారిపల్లెలో ప్రభుత్వ పాఠశాలలను ఏవిధంగా అభివృద్ది చేసారో వివరించారు.కొత్తగా ఏర్పాటుచేస్తున్న మెడికల్ కళాశాలలు,వైద్య రంగంలో సంస్కరణలపై సీఎం ప్రసంగించారు.
వ్యవసాయ రంగంపై ప్రసంగం - ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరుమార్పుతో ముగింపు
చివరిరోజు సభ తీవ్ర గందరగోళంగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హైల్త్ వర్శిటీ గా మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది సర్కార్...బిల్లు కాపీలను చించివేసి స్పీకర్ పైకి విసిరేరసారు టీడీపీ సభ్యులు.టీడీపీ సభ్యుల ఆందోళనతో వారిని సస్పెండ్ చేసారు స్పీకర్.ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.చివర్లో వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం ప్రసంగించారు. మొత్తంగా ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 21 బిల్లులకు ఆమోదం తెలిపింది సభ.26 గంటల 44 నిమిషాల పాటు సభ జరిగింది.36 మంది సభ్యులు సభలో మాట్లాడారు.4 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి.చివర్లో ప్రతిపక్ష సభ్యులు తనతో వ్యవహరించిన తీరుపై స్పీకర్ ఆవేదన వ్యక్తం చేసారు..చివరి రోజు మార్షల్స్ తో టీడీపీ సభ్యుల వ్యవహరించిన తీరును ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసారు స్పీకర్.