అన్వేషించండి

Crop Holiday in Aqua Industry: ఆక్వా రైతు ఆక్రందన - ఆదుకోకుంటే పంట విరామమే.. ప్రభుత్వానికి రైతుల అల్టిమేటం!

AP Aqua Farmers Protest: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల అత్యవసర సమావేశం అమలాపురంలో జరిగింది. సిండికేట్ వ్యవస్థను అరికట్టి, రొయ్యల ధరలను నియంత్రించకపోతే పంట విరామం ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు.

Shrimp Prices Drop Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే కీలకమైన ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సిండికేట్‌ల దెబ్బకు కుదేలవుతున్న ఆక్వా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా  పంట విరామం  ప్రకటిస్తామని ఆక్వా రైతుల రాష్ట్ర సమన్వయ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశంలో రైతులు తమ ఆవేదనను, డిమాండ్లను వెల్లడించారు. 

సిండికేట్ వల్ల సమస్యలు

డాలర్ల పంటగా పేరుగాంచిన ఆక్వా పరిశ్రమను సిండికేట్ వ్యవస్థలు పట్టి పీడిస్తున్నాయి. అమలాపురంలో  జరిగిన ఆక్వా రైతు సంఘాల సమావేశంలో రైతులు ముక్తకంఠంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎగుమతిదారులు  , మేత తయారీదారులు,   హేచరీల యజమానులు ఒక సిండికేట్‌గా ఏర్పడి ధరలను శాసిస్తున్నారని, దీనివల్ల సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోతే, ఆక్వా సాగును నిలిపివేయడం మినహా తమకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

విత్తనం దశ నుంచే మోసం

ఆక్వా సాగులో విత్తనం దశ నుంచే మోసం మొదలవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని హేచరీలు నాణ్యత లేని సీడ్‌ను పంపిణీ చేయడం వల్ల పంట ఆరంభంలోనే దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు, మేత ధరలు అమాంతం పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మేత ధరల పెరుగుదలపై రైతులు నిరసన తెలపడంతో, దానికి ప్రతీకారంగా ఎగుమతిదారులు రొయ్యల కొనుగోలు ధరలను కిలోకు రూ. 50 వరకు తగ్గించేశారని, దీనివల్ల టన్నుకు రూ. 50 వేల చొప్పున రైతులు భారీగా నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు.

విద్యుత్ సబ్సిడీ కూడా సమస్యే 

విద్యుత్ సబ్సిడీ విషయంలో కూడా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని రైతులు ధ్వజమెత్తారు. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడాలు లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు సబ్సిడీ విద్యుత్తును అందించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో నిలిపివేసిన నాన్-ఆక్వా జోన్ పరిధిలోని 12 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పరిమితులు ఆక్వా సాగును మరింత భారంగా మారుస్తున్నాయని, ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో మన రొయ్యల పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వంతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు 

రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు  రాష్ట్ర ఆక్వా రైతు సమన్వయ కమిటీ ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా ప్రతినిధులు ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఇచ్చిన గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా సాగును నిలిపివేసి నిరసన తెలుపుతామని వారు తేల్చిచెప్పారు.

ఈ సమావేశంలో భీమవరం, కోనసీమ, కైకలూరు, ప్రకాశం, ఏలూరు వంటి ప్రధాన ఆక్వా సాగు జిల్లాల నుంచి భారీగా రైతు నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదని వారు విమర్శించారు. ఎగుమతిదారుల ఆగడాలను కట్టడి చేయకపోతే, రాబోయే రోజుల్లో ఏపీ ఆక్వా రంగం కుప్పకూలడం ఖాయమని   హెచ్చరిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Srikakulam Honor Killing: కుమార్తెను చంపి గుండెపోటుగా నమ్మించిన తల్లి - ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా ?
కుమార్తెను చంపి గుండెపోటుగా నమ్మించిన తల్లి - ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా ?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ - మనీలాండరింగ్ గుట్టు అంతా ఈడీ పట్టేసిందా? - జగన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారా?
ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ - మనీలాండరింగ్ గుట్టు అంతా ఈడీ పట్టేసిందా? - జగన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget