Green skill development in Andhra Pradesh: అభివృద్ధి చెందుతున్న రంగాలకు అవసరమైన మ్యాన్ పవర్, యువతలో స్కిల్స్ పెంచుకునేవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వాలది కీలక పాత్ర. స్కిల్ డెవలప్‌మెంట్ కు అవసరమైన సౌకర్యాలు యువతకు కల్పిస్తే అందులో ప్రావీణ్యం తెచ్చుకుని అందులో ఉపాధి పొందుతారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసింది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతుందని ఆ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా నారా లోకేష్ గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ పై దృష్టి పెట్టారు.
గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించిన ప్రధాన రంగాలలో ఒకటి కావడంతో ఈ రంగం నుండి మొత్తం 7.5 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఏపీ గ్రీన్ టాలెంట్ కు హబ్ గా మారాలని కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి సుజ్లాన్ ఎనర్జీ , స్వనితి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నారా లోకేష్ ఆకాంక్షించారు.
సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలోకి ఏపీలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అదానీ, రిలయన్స్ వంటి సంస్థలు వేల కోట్ట పెట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఏర్పడనుంది. ఏపీ యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోడవానికి గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని లోకేేష్ ప్రారంభించారు. ఈ రెండు సంస్థలు పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తాయి.