Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,788 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 86 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 288 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,302,192 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1341 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,262కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,31,54,437 నిర్థారణ పరీక్షలు చేశారు. 










దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 6,396 కరోనా​ కేసులు వెలుగుచూశాయి. గురువారం 9 లక్షల మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 13,450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కోవిడ్ తో 201 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇంకా యాక్టివ్​ కేసుల సంఖ్య 69,897గా ఉంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతోంది. నిన్న మరో 24,84,412 డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 178 కోట్ల పైగా చేరింది.



  • మొత్తం కరోనా కేసులు : 4,29,44,995‬

  • మొత్తం మరణాలు : 5,14,589

  • యాక్టివ్​ కేసులు : 69,897

  • కరోనా నుంచి కోలుకున్నవారు : 4,23,67,070


Also Read: Work From Office: ఆఫీస్‌లో 100% పని ఇక చరిత్రే! హైబ్రీడ్‌ మోడల్‌కే కంపెనీల ఓటు!