Massive Transfers of IPS In Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. కీలక జిల్లాలకు ఎస్పీలను మార్చింది. మొత్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


 


కీలకమైన జిల్లాలకు ఎస్పీలను మార్చారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన రంపచోడవరం ఓఎస్డీగా ఉన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీగా ఉన్న వకుల్ జిందాల్ విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఉన్న దీపికను.. అనకాపల్లి జిల్లాకు బదిలీ చేశారు. 


సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్నను నియమించారు. ఆ జిల్లాకు ఎస్పీగా ఉన్న మాధవరెడ్డిని పార్వతీపురం మన్యం జిల్లాకు ఎస్పీగా బదిలీ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ కు పోస్టింగ్ ఇచ్చారు. కాకినాడ ఎపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్ గా కూడా విక్రాంత్ పాటిల్ వ్యవహరిస్తారు. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్ ను నియమించారు. గుంటూరు ఎస్పీగా ఉన్న తుషార్ దూడిని బాపట్ల ఎస్పీగా బదిలీ చేశారు. 


పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఐపీఎస్ అమిత్ బర్దార్ కు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. ఆ స్థానంలో ఉన్న తుహిన్ సిన్హాకు విశాఖఫట్నం డిప్యూటీ కమిషనర్ టు పోస్టింగ్ ఖరారు చేశారు. టీటీడీలో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్న నరసింహ కిషోర్ ను ఈస్ట్ గోదావరి ఎస్పీగా నియమించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, కృష్ణాజిల్లా ఎస్పీగా గంగాధర్ రావు, వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ హష్మిని నియమించారు.




 


ఎన్నికల సమయంలో హింస జరిగిన పల్నాడు  జిల్లాకు కే శ్రీనివాసరావును ఎస్పీగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న మల్లికాగార్గ్ ను ఎపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కర్నూలు జిల్లా ఎస్పీగా  బిందుమాధవ్, నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ , కడప జిల్లా ఎస్పీగా హర్షవర్దన్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీగా కేవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడును నియమించారు. సుబ్బారాయుడు డిప్యూటేషన్ మీద తెలంగాణ నుంచి వచ్చారు. రెడ్ శాండల్ టార్స్ ఫోర్స్ కు కూడా సుబ్బరాయుడు నేతృత్వం వహిస్తారు. ఇంటలిజెన్స్ ఎస్పీగా  గీతాదేవికి పోస్టింగ్ ఇచ్చారు.            


బదిలీ చేసినా కొంత మందికి పోస్టింగులు దక్కలేదు. జీఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, హరీఫ్ హఫీజ్, రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, పి. జగదీష్, శ్రీధర్, ఎం.సత్తిబాబు వంటి ఐపీఎస్ అధికారుల్ని డీజీపీ ఆపీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.