Andhra Pradesh new districts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల సరిహద్దుల మార్పు, మండలాలు, గ్రామాల సర్దుబాట్లు, పేర్ల మార్పు వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. గత YSRCP ప్రభుత్వం చేసిన జిల్లా విభజనలో ఏర్పడిన గందరగోళాన్ని సరిచేయడం, ప్రజల సౌకర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా మార్పు, చేర్పులపై ఆలోచనలు చేస్తున్నారు.  ప్రజా అభిప్రాయాలను సేకరించి, శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని కమిటీ పనిచేస్తోంది.

కానీ మొత్తం ఏడుగురు మంత్రులతో ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ప్రజల నుంచి సూచనలు సేకరించడంలో కమిటీ పాల్గొంటుంది.  గత ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజాభిప్రాయాలను పట్టించుకోుకండా ..అసమంజసమైన సరిహద్దులతో జిల్లాలను ఏర్పాటు చేశారన్న అభిప్రాయం ఉంది.  రంపచోడవరం నుంచి  జిల్లా కేంద్రానికి 187 కి.మీ. దూరం ఉంది. దీని  వల్ల గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు ఇవి సరిచేయడానికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.               

అలాగే సరిహద్దులు , పేర్ల మార్పుపైనా కసరత్తులు చేస్తున్నారు.  జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ల ఆధారంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.  ఇతర జిల్లాల్లో సరిహద్దులు మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి.  అద్దంకి (బాపట్ల జిల్లా), కందుకూరు (నెల్లూరు జిల్లా) ఒంగోలు, కొండపి, సంతనుతలపాడు (మొత్తం 5 నియోజకవర్గాలు)తో ప్రకాశం జిల్లా, కృష్ణ జిల్లా నుంచి గన్నవరం, పెనమలూరు NTR జిల్లాలో కలపడం (విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, తిరువురు, మ్యలవరం – మొత్తం 7). విజయనగరం జిల్లా నుంచి ఎస్.కోటా విశాఖపట్నంలో చేర్చడం, తూర్పు గోదావరి జిల్లాలో మండపేట చేర్చడం, కాకినాడ జిల్లాలో రామచంద్రాపురం చేర్చడం. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు చేర్చడం వంటి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది.  కలెక్టర్ల ద్వారా సూచనలు సేకరణ, ప్రజా అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారు.  

 మార్కాపురం కొత్త జిల్లాను  గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు చేర్చి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.  గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 29 గ్రామాలు, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట వంటి 5 నియోజకవర్గాలతో అమరావతి జిల్లా   ఏర్పాటు,   రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్ నుంచి 4 మండలాలు కలిపి రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల సరిహద్దులు మార్చే ప్రక్రియ  ఉది.                       

 కమిటీ ఈ నెలలోనే సమావేశాలు నిర్వహిస్తూ, అసెంబ్లీ సమావేశాలకు ముందు   నివేదిక సమర్పించనుంది.  మొత్తం ప్రక్రియ 2025 డిసెంబర్ 31కి పూర్తి చేయాల్సి ఉటుది.  2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు సెన్సస్ కారణంగా జిల్లా మార్పులు చేయలేరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.