CM Jagan Birthday wishes: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి(CM) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagana Mohan Reddy) పుట్టినరోజు సందర్భంగా... సంక్షేమ సామ్రాట్‌కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ విషెస్‌  చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా మరో మూడు దశాబ్దాల పాటు వుండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా  జరుపుతున్నారు పార్టీ శ్రేణులు. ప్రతి గ్రామంలో సీఎం జగన్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రక్తదాన  శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు... వృద్ధ, ఆనాథ ఆశ్రమాల్లో కేక్‌ కట్‌ చేసి... పండ్లు పంచి పెడుతున్నారు. అంతేకాకుండా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు కూడా నాటుతున్నారు.



చంద్రబాబు విషెస్


ఏపీలో ఉప్పు - నిప్పులా ఉండే నేతలు చంద్రబాబు, జగన్. పరస్ఫర ప్రత్యర్థులైన వీరి మధ్య కూడా చిన్నపాటి బర్త్ డే విషెస్ కన్వర్జేషన్ నడిచింది. చంద్రబాబు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ట్విటర్ ద్వారా తెలపి.. జగన్ ను ట్యాగ్ చేయగా.. అందుకు జగన్ కూడా థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు.






 


మోదీ విషెష్‌


ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతొ, సంతోషఃగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు ప్రధాని. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా... సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ మోహన్‌రెడ్డికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు.






 


సాయిరెడ్డి శుభాకాంక్షలు 


సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా... వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో  వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంఏతకాదు... ఆయన మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాఅంటూ  ట్వీట్‌ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.







మంత్రులు శుభాకాంక్షలు


మంత్రి ఆర్కే రోజా కూడా ట్వీట్‌ చేశారు. సంక్షేమ సామ్రాట్ అయిన మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్‌  తెలియచేశారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా పేదలకు సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు మంత్రి రోజా. శాంటాక్లాజా వేషంలో నిరుపేద ఇంటికి వెళ్లి కానుకలు ఇచ్చారు.







పవన్ శుభాకాంక్షలు 


సీఎం వైఎస్‌ జగన్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు ఆకాంక్షించారు. 


 


రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు


సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. SRIT ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శింగనమల  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో  సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కేక్‌ కట్‌ చేశారు.ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువత పెద్దసంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.  ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరిలో కూడా సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్తూ ఫ్లెక్సీలు పెట్టారు. తమ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుకుంటున్నారు పార్టీ నేతలు,  కార్యకర్తలు.



లండన్‌లో సంబరాలు


రాష్ట్రంలోనే కాదు... విదేశాల్లో కూడా ఏపీ సీఎం జగన్‌ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. లండన్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో  జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. సీఎం జగన్‌ జన్మదిన వేడుకలో ఉత్సాహంగా  పాలుపంచుకున్నారు. ప్రతీపేదవాడి భవిష్యత్‌ బాగుండాలంటే... జగనే మళ్లీ ఏపీ సీఎం కావాలని చెప్పారు  వైఎస్‌ఆర్‌సీపీ యూకే కమిటీ నేతలు. ఎన్నికలకు మరో మూడు  నెలలు మాత్రమే సమయం ఉండటం వల్ల ప్రతిఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేసి ఏపీలో వైఎస్‌ జగన్‌ గెలుపు కోసం కృషిచేయాలని చెప్పారు.