AP High Adjourned Hearing on IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (IRR Case) టీడీపీ అధినేత, చంద్రబాబు (Chandrababu) ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అప్పటివరకూ చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. మరోవైపు, ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపైనా విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.


420 పేజీల అడిషనల్ అఫిడవిట్ 




ఇన్నర్ రింగ్‌ రోడ్డుకు కేసుకు సంబంధించి చంద్రబాబు ప్రమేయంపై సీఐడీ 470 పేజీల అడిషనల్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో బాబుకు బెయిల్ మంజూరు చెయ్యొద్దని కోరింది. హెరిటేజ్ భూముల కొనుగోలుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధం ఉందని చెప్తూ, అలైన్మెంట్ మార్పు వివరాలతో కూడిన దాదాపు 200 అంశాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏజీ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, విచారణలో భాగంగా అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఉచిత ఇసుక పాలసీలోనూ అక్రమాలు జరిగాయని, రూ.వందల కోట్ల ఆదాయానికి గండి పడిందంటూ నమోదైన కేసులోనూ విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఏజీ అందుబాటులో లేకపోవడంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. 2 కేసుల్లో తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


లిక్కర్ కేసు విచారణ సైతం


మరోవైపు, లిక్కర్ కేసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి (నవంబరు 27) వాయిదా వేసింది. ఈ మద్యం కేసులో చంద్రబాబును సీఐడీ ఏ-3గా చేర్చిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తికి చెందిన డిస్టిలరీస్‌కి చంద్రబాబు లబ్ధి చేకూర్చారనేది సీఐడీ ఆరోపణ. 2015లో ప్రభుత్వం లిక్కర్ దుకాణాల విధానానికి ఓ సవరణ చేసింది. అందులో భాగంగా ఆ షాపులు చెల్లించే ప్రివిలైజ్ ఫీజును రద్దు చేయడం ద్వారా వారికి లబ్ధి చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌, చంద్రబాబు తరఫున నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం (నవంబర్ 23) వాదనలు వినిపించారు.


ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రతిపాదన పంపారని, కమిషనర్‌ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించిందని అడ్వకేట్ నాగముత్తు కోర్టుకు తెలిపారు. ఫైల్‌పై అప్పటి రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చంద్రబాబు పర్సనల్ నిర్ణయం కాదని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ వాయిదా వేసింది. దీంతో మొత్తం 3 కేసుల విచారణ దాదాపు ఈ నెలాఖరుకు వాయిదా పడింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply




Also Read: Supreme Issued Notices to CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ పిటిషన్ - జగన్, సీబీఐకు సుప్రీం నోటీసులు