AP employees demands: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన  కోసం చర్చలు జరుపుతున్నారు.  మంత్రులతో   ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగులు కీలక డిమాండ్లను ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లారు.  12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మద్యంతర భృతి (I.R) ని ప్రకటించాలని ఉద్యోగ నేతలు కోరుతున్నారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Continues below advertisement

డిమాండ్ల జాబితాను మంత్రుల ముందు పెట్టిన ఉద్యోగ సంఘాలు                     రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎనకాష్మెంట్ ఇతర బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని..  ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 4 పెండింగ్ డీ.ఏలను ప్రకటించాలి. డిఏ బకాయిలను, 11వ పిఆర్సి బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను, సి.పి.యస్ వారికి 90% డి.ఏ పెండింగ్ ను వెంటనే చెల్లించుటకు రోడ్ మ్యాప్ ను రూపొందించాలని కోరారు.  సి.పీ.ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 01 తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన  వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నం:57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోనికి తీసుకుని రావాలి. 14% కాంట్రిబ్యూషన్ ను ప్రభుత్వం చెల్లించాలని  డిమాండ్ చేశారు.   

టీచర్ల సమస్యలు మరిన్ని ఎక్కువ                  పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఉపాధ్యాయులకు బోధన తప్ప, ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.  EHS/ మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలని..  నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను ఉపయోగంలోకి తెచ్చే విధంగా పాలసీలను మార్చాలన్నారు.  1998, 2008 MTS టీచర్లను రెగ్యులర్ చేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 62 సం.లకు పెంచాలి. మిగిలిన 1998 క్వాలిఫైడ్ టీచర్స్ అందరికీ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కోరారు.    

Continues below advertisement

కొన్ని డిమాండ్లను పరిష్కరించనున్న ప్రభుత్వం                                                        

ఉద్యోగ సంఘాల నేతలు నాలుగు డీఏలు బకాయిలు ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని కోరారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో  పయ్యావుల కేశవ్   ముఖ్యమంత్రితో  మాట్లాడిన తర్వాత  ప్రకటన చేస్తామన్నారు. దీపావళి సందర్భంగా.. రెండు డీఏలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు తమ  పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.