అన్వేషించండి

YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం; అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చ

YS Jagan: నేడు వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరవుతున్న వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చిస్తారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. ఇన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ ఇకపై సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. జగన్ మినహా నేతలంతా సమావేశాలకు వెళ్తారు. అందుకే అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు, గళం వినిపించాల్సిన ప్రజా సమస్యలపై చర్చించేందుకు నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ ఉద్రిక్తతలు, వైసీపీ నేతలపై పెడుతున్న వరుస కేసులు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ప్రజాసమస్యలపై పోరాటం గురించి చర్చిస్తారు. 

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు వరుసుగా వేస్తున్న పీటీ వారెంట్‌లు, కల్తీ నెయ్యిపై చెలరేగిన దుమారం, దీనిపై ప్రశ్నించిన నేతల ఇళ్ల జరిగిన దాడులు, కల్తీ మద్యం కేసులో నేతల అరెస్టులు,  ఇవన్నీ కూడా ప్రభుత్వ కక్షసాధింపులో భాగమేనని వైసీపీ విమర్శిస్తోంది. ఇప్పటి వీటిపై క్షేత్రస్థాయిలో వైసీపీ పోరాటం చేస్తోంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే దీన్ని మరింత తీవ్రంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో వైసీపీ ఉంది. అందుకే సభలోనే ఇలాంటి వాటిని చర్చకు లేవనెత్తి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తోంది. 

ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని ప్రకటించిన వైసీపీ కాస్త వెనక్కి తగ్గి సభకు హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జగన్ మినహా ఎమ్మెల్యేలంతా సమావేశాలకు హాజరుకానున్నారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీలను ప్రైవేటీకరించడం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నేతలపై వరుస కేసులు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలను సభలోనే ప్రస్తావించాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది. అంతే కాకుండా సభకు వెళ్లకపోవడంతో గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోతున్నామనే భావన వైసీపీలో చాలా కాలంగా ఉంది. పార్టీ శ్రేణుల్లో కూడా దీనిపై అసహనం వ్యక్తమవుతోంది. 

పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉంటే, అటు అధికార పార్టీ నుంచి కూడా అంతకు మించిన ఒత్తిడి ఉంది. వరుసగా సమావేశాలకు హాజరుకాకుంటే అనర్హత వేటు వేస్తామనే హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అనవసరంగా అనర్హత వేటు పడితే ఉపఎన్నికలు వెళ్లడం వల్ల కలిగే నష్టాలను పార్టీలో పెద్దస్థాయిలో చర్చ జరిగింది. అందుకే సభలోనే ప్రభుత్వంతో ఢీ కొట్టి ప్రజల్లో మార్కులు పొందాలని, గళాన్ని వినిపించి కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించింది. సమావేశాలకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 

గతంలో చెప్పినట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు రాబోమని చెప్పిన మాటను కాస్త సవరించుకున్నారు. జగన్‌ మినహా మిగతా నేతలంతా సమావేశాలకు హాజరవుతారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు జగన్ సమావేశాలకు హాజరుకాబోరని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో నేతలంతా సభకు రానున్నారు.                     

Frequently Asked Questions

వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ఎక్కడ జరుగుతుంది?

వైసీపీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది.

ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కక్షసాధింపులో భాగంగా కేసులు పెడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా?

అవును, జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

సభలో వైసీపీ లేవనెత్తాలని నిర్ణయించిన అంశాలు ఏమిటి?

వైద్య కాలేజీల ప్రైవేటీకరణ, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, నేతలపై కేసులు, లా అండ్ ఆర్డర్ సమస్యలను సభలో ప్రస్తావించాలని వైసీపీ నిర్ణయించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Embed widget