చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పిందని, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చేశారని జగన్ ఆరోపించారు. అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారు.
YS Jagan Latest News: "చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు! పెట్రోల్‌పై 8 రూపాయలు తగ్గింగాలి" జగన్ హాట్ కామెంట్స్!
YS Jagan Latest News:వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు పని అయిపోతుందని ఆయనకు ఇవే చివరి ఎన్నికలని విమర్శించారు వైఎస్ జగన్. ఈ వయసులో చేస్తున్న రాజకీయాలు ఏంటని ప్రశ్నించారు.

- పాలన గాడి తప్పింది, క్రిమినల్ బ్రెయిన్ తో వైసీపీ నేతలే లక్ష్యం.
- అవినీతి, దోపిడీ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతోంది.
- పెట్రోల్ ధరపై 8 రూపాయలు తగ్గించి, ప్రజలకు మేలు చేయాలి.
- చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, వయసులోనూ దౌర్భాగ్యపు రాజకీయాలు.
YS Jagan Latest News: ఆంధ్రప్రదేశ్‌లో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్. చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్‌తో వైసీపీ నేతలే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన యాక్టీవ్‌గా ఉండరని, అందుకే నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆఖరి పాలన సమయంలోనైనా ప్రజలకు మంచి చేయాలని జగన్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ ధరలు తగ్గించాలని లీటర్‌పై 8 రూపాయల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది: జగన్
ఆంధ్రప్రదేశ్‌ను జంగిల్ రాజ్‌గా మార్చేసి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. రెండేళ్లలో ప్రజలకు మంచి చేయకపోగా ప్రశ్నించి వారిపై కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు. తనకు ప్రతికూలంగా ఏదైనా విషయం వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతుందని ఎద్దేవా చేశారు.
మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోతుంది: జగన్
అమరావతి అయితే జీరో నుంచి మొదలు పెట్టాలని అందుకే తాము మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు జగన్. ఆ పదం వింటేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్రం చేస్కున్న దురదృష్టమని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల భవిష్యత్‌లో కూడా ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే అమరావతి కోసం 47 వేల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్ర ఖజానా నుంచి 9 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ పర్మినెంట్ బిల్డింగ్స్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు.
చదరపు అడుగు ఖర్చు 30 వేలు: జగన్
కేవలం ఐదు బిల్డింగ్‌ల కోసం చేస్తున్న ఖర్చు చూసి జనం నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఐదు బిల్డింగ్స్ కోసం చదరపు అడుగు కోసం 20, 427 రూపాయలు ఖర్చు చేస్తున్నారని పాత లెక్క ప్రకారం ఇది ఐదు వేలే అన్నారు. తెలంగాణ నిర్మించిన సచివాలయానికి కూడా అంత ఖర్చు కాలేదని, ప్రపంచంలోని ఏ కట్టడాలకు ఇంత ఖర్చు చేయడం లేదని చెప్పారు. ఇది కేవలం నిర్మాణ ఖర్చు మాత్రమేనని ఇంకా ఫర్నీచర్, ఇంటీరియర్ లెక్కలు వేసుకుంటే అది 30 వేలు దాటిపోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కిలోమీటర్ రోడ్డుకు 53 కోట్లు : జగన్
జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటర్‌కు 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం చెప్పిందని చంద్రబాబు మాత్రం అమరావతిలో రోడ్లకు కిలోమీటర్‌కు 53 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ తెలిపారు. బిల్డింగ్స్, రోడ్ల విషయంలోనే కాకుండా ప్లాట్ల కేటాయింపులో కూడా స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సామాన్యులకు చెరువుల్లో, కుంటల్లో, ప్లాట్లు కేటాయిస్తూ సన్నిహితులకు మాత్రం రోడ్లు పక్కనే భూములు ఇప్పించారని ఆరోపించారు.
లీటర్ పెట్రోల్ ధర రూ. 8 తగ్గించాలి: జగన్
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్న వ్యక్తి తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారని జగన్ ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామనని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని పెంచేశారని మండిపడ్డారు. కోవిడ్ టైంలో కూడా తాము రూపాయి మాత్రమే పెంచామని తర్వాత పెంచలేదని గుర్తు చేశారు. ఇంధన సంక్షోభంలో కూడా చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్‌కు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
చంద్రబాబులే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు. చంద్రబాబులా తన తండ్రి హత్యా రాజకీయాలు నేర్పించలేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయని చెప్పారు. ఈ వయసులోనూ ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే తాను మాత్రం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నామన అందుకు గర్వంగా ఉందన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
చంద్రబాబు పాలనపై జగన్ ఏమని ఆరోపించారు?
అమరావతి విషయంలో జగన్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటి?
అమరావతి నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని, దానివల్ల భవిష్యత్‌లో కూడా ఏపీకి రాజధాని లేకుండా పోతుందని జగన్ అన్నారు. ఇప్పటికే అమరావతికి అప్పులు, ఖర్చులు ఎక్కువగా అయ్యాయని తెలిపారు.
అమరావతి నిర్మాణ ఖర్చులపై జగన్ ఏమన్నారు?
కేవలం ఐదు భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు 20,427 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది చాలా ఎక్కువ అని జగన్ తెలిపారు. ఫర్నీచర్, ఇంటీరియర్స్‌తో కలిపితే ఈ ఖర్చు 30 వేలు దాటుతుందని అన్నారు.
పెట్రోల్ ధరలను ఎంత తగ్గించాలని జగన్ డిమాండ్ చేశారు?
ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పెంచారని జగన్ ఆరోపించారు. ప్రస్తుత లెక్క ప్రకారం లీటర్‌కు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















