చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించిన కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, ఇది అనుమానాస్పదంగా ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
YS Jagan Latest News: చంద్రబాబు వార్నింగ్ తర్వాతే రాజశేఖర్ రెడ్డి మృతి! నేటికీ అనుమానాలున్నాయ్?: జగన్
YS Jagan Latest News: ముఖ్యమంత్రి చంద్రబాబుదే క్రిమినల్ బ్రెయిన్ అని వైఎస్ జగన్ ఆరోపించారు. తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోయిన సంయమనంతో ఉన్నామని చెప్పారు.

- తండ్రి మృతిపై అనుమానాలు, చంద్రబాబు వార్నింగ్ తర్వాతే ప్రమాదం: జగన్
- రాజకీయాలకు కుటుంబ సభ్యుల బలి, చంద్రబాబుపై జగన్ ఆరోపణలు
- వివేకానంద రెడ్డి హత్య, గన్ కల్చర్ చంద్రబాబుదే: జగన్ విమర్శలు
- ఎన్టీఆర్ వెన్నుపోటు, రంగా హత్యలో చంద్రబాబు పాత్ర: జగన్
YS Jagan Latest News: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి మృతిపై నేటికీ తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన తర్వాతే రెండు మూడు రోజులకు వైఎస్‌ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని అన్నారు. ఇలాంటివి తన కుటుంబంలో మూడు ఘటనలు జరిగాయన్నారు. తన తండ్రిని, చిన్నానను చంపేశారని ఆరోపించారు. బాధితులమైన తమపై నిందలు వేసి గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల కోసం తాతను చంపేశారు: జగన్
"మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. మా తాత, మా నాన్న, చిన్నాన్న ముగ్గురు రాజకీయాలకు బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే తప్పుడు ప్రచారం చేస్తూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. రాజారెడ్డిని చెప్పిందెవరు? టీడీపీ వాళ్లే కదా, ఈ ఘటన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది."
ఎవరిది క్రిమినల్ బ్రెయిన్
1999 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రాజశేఖర్‌ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపేశారని అన్నారు. రాజకీయ కోణంతో ఈ పని చేశారన్నారు. "తాత రాజారెడ్డి హత్య కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ టీడీపీ ఆఫీస్‌లో దాచి పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి వారికి శిక్ష పడకుండా చేశారు. ఇందులో ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అని చంద్రబాబును అడుగుతున్నాను."
చంద్రబాబు వార్నింగ్ తర్వాత వైఎస్‌ఆర్ మృతి
తాతా విషయంలోనే కాదు నాన్న వైఎస్ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. వైఎస్ఆర్ చనిపోక ముందు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. "మా నాన్న విషయంలోనూ అంతే, చనిపోక ముందే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అన్నారు. రెండు మూడు రోజులకే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవరిదీ హత్యా రాజకీయాలు చంద్రబాబు." అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్నారు. ఆయన వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేసి వచ్చిన తర్వాత హత్య చేశారని చెప్పారు. ఆ హత్య కేసును కూడా తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. వైసీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసి వచ్చారు. తానే చంపినట్టు చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల సెక్యూరిటీలో కారులో తిరుగుతున్నారు. చంద్రబాబు లాయర్, దస్తగిరి లాయర్ కూడా ఒక్కరే. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షిస్తున్నారు. " అని విమర్శలు చేశారు.
ఎవరిది గన్ కల్చర్?
గన్ కల్చర్ కూడా చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ టపా టపా అని ఇంట్లో కాల్పులు జరపలేదా అని ప్రశ్నించారు. సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు వాచ్‌మెన్ కూడా హత్య చేశారని ఆరోపించారు. " చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపాటపా అని కాల్చిపడేయలేదా. ఎవరిది గన్ కల్చర్ అని అడుగుతున్నాను. ఆ తర్వాత సాక్ష్యం ఉండకూడదని ఆ ఇంట్లో ఉన్న వాచ్‌మెన్‌ను బండరాయితో కొట్టి చంపేశారు. హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు. ఎవరిది శవ రాజకీయాలు." అని జగన్ ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, రంగా హత్యలో ఎవరి పాత్ర ఉంది?
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవంలో, రంగా హత్య కేసులో ఎవరి పాత్ర ఉందో తెలుగు ప్రజలకు తెలుసని జగన్ అన్నారు. "కూతురును ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని గుర్తును లాక్కొని చనిపోయేలా చేసింది ఎవరని అడుగుతున్నాను. వంగవీటి మోహన్ రంగా ఎలా చనిపోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్లు అన్నీ కూడా చంద్రబాబు వైపే చూస్తున్నాయి. హరిరామజోగయ్య ఏకంగా పుస్తకం రాశారు. ఆ హత్యకేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ నేటికీ టీడీపీ ఎమ్మెల్యే." అని గుర్తు చేశారు.
" ఎన్టీఆర్‌పై దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొన్ని రోజులకే డెడ్‌బాడీగా మారాడు. ఆయన జేబులో లెటర్ దొరికింది. మూడు లక్షలు ఇస్తానని చెప్పారని ఉందని ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు అనే విషయంపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వెళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. పింగలి దశరథ్‌రామ్ అనే జర్నలిస్ట్‌ను కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటనలో చంద్రబాబు వైపే వేళ్లని చూపించాయి." అని చరిత్ర వివరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
వైఎస్ జగన్ తన తండ్రి మృతిపై ఎవరిని అనుమానిస్తున్నారు?
రాజారెడ్డి హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఏమిటని జగన్ ఆరోపిస్తున్నారు?
రాజారెడ్డి హత్య కేసులో దోషులను హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో దాచిపెట్టి, అధికార దుర్వినియోగంతో శిక్ష పడకుండా చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది మరియు జగన్ ఎవరిని నిందిస్తున్నారు?
వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, వైసీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసి వచ్చిన తర్వాత ఆయన హత్యకు గురయ్యారని జగన్ తెలిపారు.
బాలకృష్ణ కాల్పుల సంఘటనపై జగన్ ఏమన్నారు?
చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ ఇంట్లో గన్ పట్టుకుని కాల్పులు జరిపారని, సాక్ష్యాలు లేకుండా చేయడానికి వాచ్‌మెన్‌ను కూడా హత్య చేశారని జగన్ ఆరోపించారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు, రంగా హత్యలో జగన్ ఎవరిని పేర్కొన్నారు?
కూతురిని ఇచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని, తెలుగు ప్రజలకు తెలుసునని జగన్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















