YSRCP MP Vijayasai Reddy: ఏపీలో బాగా డెవలప్ అయిన నగరాలు లేవని అధికార పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని రాజధాని సమస్య వెంటాడుతూనే ఉంది. బాగా డెవలప్ అయిన మెట్రో నగరం ఉంటే ఏపీలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజధానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాగా, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు మనకు లేకున్నా ఐటీ ఎగుమతుల్లో 5 వేల కోట్లతో 34% నమోదైన వృద్ధి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం వల్లనే సాధ్యమైందన్నారు. 
విశాఖతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి కంపెనీల ఏర్పాటును ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఐటీ రంగంలో ఈ ఏడాది కొత్తగా మరో 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అసలు రాజధానే లేకుండా మూలన పడేస్తే ఏమనుకోవాలి? రాజధాని లేని రాష్ట్రానికి ఐటీ కంపెనీలు ఎలా వస్తాయని టెకీలు అంటున్నారు. ఇటీవల అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసినా విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చి సహకరిస్తుందని, రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరని ఆయన అన్నారు. రెండు ప్రభుత్వాలు మధ్య ఎప్పటికి సత్సంబంధాలు ఉంటాయని తెలిపారు.


ప్రత్యేకమైన పార్టీ బాధ్యతలేమీ లేనట్లే ! 
గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా పని చేశారు. కానీ ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డికి పెద్దగా ఏమీ బాధ్యతలు లేవు. అనుబంధ సంఘాల ఇంచార్జ్ గా ఉన్నారు.  కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇటీవల విజయసాయిరెడ్డి మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నారు.  అనుబంధ సంఘాలతో రోజూ సమీక్షలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దనుకున్న రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని సీఎం జగన్ తాజా ప్రకటనతో తేలిపోయిందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 


రానున్న 10 ఏళ్లల్లో భారత్ బలమైన 7 ట్రిలియన్ల ఆర్థికశక్తిగా ఎదుగుతుందని HSBC తాజా నివేదిక వెల్లడించిందని విజయసాయిరెడ్డి ఇటీవల పేర్కొన్నారు. దేశంలోని అపార మానవవనరులు, ఎదగాలనే తపన ఉన్న మధ్యతరగతి, వాణిజ్య, పారిశ్రామికీకరణ పురోగతి కోసం ప్రభుత్వం  అనుసరిస్తున్న సరళీకృత విధానాల కారణంగా దేశం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఆ నివేదిక తెలిపింది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial