అన్వేషించండి

Tiruvuru MLA Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ అధిష్ఠానం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిందా? అసెంబ్లీ లాబీల్లో ఏం జరిగింది?

Tiruvuru MLA Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు టీడీపీ చివరి హెచ్చరిక చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మారకుంటే చర్యలు తప్పవని కూడా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Tiruvuru MLA Kolikapudi Srinivas: రాజకీయాల్లో గెలిచినప్పుడు ఉండే ఉత్సాహం వేరు, కానీ గెలిపించిన పార్టీ గీత దాటినప్పుడు వచ్చే ఇబ్బందులు వేరు. ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ విషయంలో సరిగా ఇదే జరుగుతోంది. గత కొద్ది రోజులుగా తన ప్రవర్తనతో సోషల్ మీడియా పోస్టులతో పార్టీని, పార్టీ నేతలను ఇరకాటంలో పెడుతున్న కొలికపూడికి టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. అసెంబ్లీ లాబీల్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనను పిలిచి క్లాస్ తీసుకున్నారు. 

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు కొలికపూడిని పక్కకు పిలిచి హెచ్చరించారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మీరు పెట్టే ఆ వాట్సాప్ స్టేటస్‌లు ఏంటీ? ఎవరి మీద మీరు పోరాటం చేస్తున్నారు? పార్టీ క్రమశిక్షణ దాటితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని పల్లా స్పష్టం చేశారు. అంటే ఎమ్మెల్యేగా గెలిచారు కాబ్టి నేనే పెద్ద లీడర్ అనుకుంటే కుదరదని, పార్టీ గీసిన గీత లోపలే ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. 

కొలికపూడిపై ఎందుకంత ఆగ్రహం?

కొలికపూడి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. నియోజకవర్గంలోని సమస్యల మీద, లేదా పార్టీలోని ఇతర నాయకులపై ఆయన పెడుతున్న పోస్టులు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన సంయమనం లేకుండా, బహిరంగ వేదికలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి కొలికపూడి చెప్పే సమాధానం నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యానని, కొంచెం అనుభవరాహిత్యం వల్ల పొరపాట్లు జరిగి ఉండొచ్చు అని చెబుతున్నారు. సీనియర్లు చెబితే సరి చేసుకుంటానంటూ సమర్థించుకున్నారు. 

Image

కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని ఉద్దేశించి ఎప్పటికప్పుడు చంద్రబాబు,లోకేష్‌ సహా సీనియర్లంతా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. చేసే పనులు పార్టీలైన్‌లో లేకుంటే అనవసరమైన గొడవలకు దారితీస్తుందని అన్నారు. వ్యక్తిగత అహంకారం ఎప్పుడూ పార్టీ లక్ష్యాల కంటే పెద్దది కాకూడదని కూడా చంద్రబాబు గతంలో హెచ్చరించారు. చంద్రబానే నేరుగా ఒకసారి పిలిచి శ్రీనివాస్‌తో మాట్లాడారు. అయినా ఆయన తీరులో మార్పు రాలేదు. అయితే ఇప్పుడు కొలికపూడికి ఇచ్చింది చివరి హెచ్చరికని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన వైఖరిలో మార్పు రాకుంటే కచ్చితంగా చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

Frequently Asked Questions

కొలికపూడి శ్రీనివాస్‌ ఏ పార్టీకి చెందినవారు?

కొలికపూడి శ్రీనివాస్‌ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన తిరువూరు ఎమ్మెల్యే.

కొలికపూడి శ్రీనివాస్‌పై పార్టీ నాయకత్వం ఎందుకు ఆగ్రహించింది?

కొలికపూడి తన ప్రవర్తన, సోషల్ మీడియా పోస్టుల ద్వారా పార్టీని, నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల పార్టీ నాయకత్వం ఆగ్రహించింది.

కొలికపూడి శ్రీనివాస్‌ను ఎవరు హెచ్చరించారు?

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కొలికపూడి శ్రీనివాస్‌ను పిలిచి హెచ్చరించారు.

కొలికపూడి శ్రీనివాస్‌ తన తప్పులను ఎలా సమర్థించుకున్నారు?

కొలికపూడి తాను కొత్తగా ఎమ్మెల్యే అయ్యానని, అనుభవరాహిత్యం వల్ల పొరపాట్లు జరిగి ఉండొచ్చని, సీనియర్లు చెబితే సరిదిద్దుకుంటానని సమర్థించుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget