స్పీకర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తు స్పీకర్ అనురిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకే సభలో సరైన గౌరవం లేకపోవడంతోపాటు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. 


అధికారంపక్షం, స్పీకర్‌ తీరుకు నిరసనగా సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ప్రకటించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శాసనసభను వైసీపీ కార్యాలయంలా మర్చేశారని ఆరోపించారు. సభలో  సభ్యుల హక్కులకు భంగం కలిగించారని ధ్వజమెత్తారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరనీ సమానంగా చూడాలని కానీ తమకు యూజ్‌లెస్‌ఫెలోస్ అంటూ తిట్టడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెబితే ప్రత్యేక సమావేశాలు పెట్టి అవినీతిపై చర్చిద్దామని సవాల్ చేశారు అచ్చెన్న. బాబును అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చించడానికి సిద్ధమని అన్నారు.