అన్వేషించండి

AP Municipal Elections: ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ పట్టణ సంస్థల పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.
  • నవంబర్ 18లోపు నోటీసు, 23న పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.
  • వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలో.
  • నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఎన్నికలు జరపాలని కమిషనర్ సూచించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 87 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల  సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారని, అనంతరం 23వ తేదీన పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారని  తెలిపారు.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైస్ చైర్‌పర్సన్  ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లలో  డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లు, మేయర్‌ లు ఎన్నికైన ఒక వార్డు సభ్యున్ని డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ గా  ఎన్నుకోనున్నారని AP SEC పునేఠా తెలిపారు.

ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్ణీత తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా సూచించారు.

మున్సిపాలిటీల పరోక్ష ఎన్నికల షెడ్యూల్ వివరాలు

మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు: 87

మున్సిపల్ కార్పొరేషన్లు: 13

ఎన్నికల నోటీసు జారీ: నవంబర్ 18 లోపు

పరోక్ష ఎన్నికల నిర్వహణ: నవంబర్ 23వ తేదీ

ఏదైనా అనివార్య కారణాల వల్ల నవంబర్ 23న పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే ఆ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 24 తేదీన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ షెడ్యూల్ కీలకంగా మారనుంది. ఈ ఎన్నికలతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ, ముందుకు సాగనుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సహకరించాలని అనిల్ చంద్ర పునేఠా పిలుపునిచ్చారు.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఈ పరోక్ష ఎన్నికల ముఖ్యమైన తేదీలు ఏమిటి?

ఎన్నికల నోటీసు నవంబర్ 18 లోపు జారీ చేయబడుతుంది. పరోక్ష ఎన్నికలు నవంబర్ 23న జరుగుతాయి. ఒకవేళ నవంబర్ 23న సాధ్యం కాకపోతే, నవంబర్ 24న పూర్తి చేయాలి.

పరోక్ష పద్ధతిలో ఏ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు?

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Politics:రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget