గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు సరఫరా అయిన సుమారు 60 లక్షల కిలోల నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అది నెయ్యే కాదని సిట్ నివేదిక తేల్చింది. పామాయిల్, రసాయనాలతో కూడిన ద్రవాన్ని నెయ్యిగా సరఫరా చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్, మాధవ్ చర్చలు! తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు సహా కీలక అంశాలపై మంతనాలు!
Andhra Pradesh: రాష్ట్రంలోని కల్తీ నెయ్యి కేసు సహా పలు కీలకాంశాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. వైసీపీపై పోరాటానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

Andhra Pradesh: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను తుపాను సృష్టిస్తోంది. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక ఆధారంగా వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు అధికార కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యూహాన్ని రచిస్తోంది.
కూటమి నేతలతో ముఖ్యమంత్రి మంతనాలు
సిట్ నివేదిక బయటకు వచ్చిన వేళ తదుపరి అడుగులు ఎలా వేయాలనే దానిపై చర్చించేందుకు అగ్రనేతలు చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో మాట్లాడుతున్నారు. ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలు ఒక యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నారు.
సిట్ ఛార్జ్‌షీట్‌లో విస్మయక వాస్తవాలు
సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలు సామాన్య భక్తులకు సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయిన సుమారు 60 లక్షల కిలోల నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అసలు అది నెయ్యే కాదని సిట్ తేల్చింది. కేవలం పామాయిల్,, ఇతర రసాయనాలతో కూడిన ఒక ద్రవాన్ని నెయ్యిగా భ్రమించి సరఫరా చేశారని నివేదికలో పేర్కొన్నారు.
ఈ నెయ్యి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని, దీని వల్ల శ్రీవారి నిధులు సమారు 233 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం అయ్యాయని కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడం నుంచి నాణ్యత తనిఖీ చేయకుండానే నెయ్యిని అనుమతించడం వరకు ఈ వ్యవహారం వెనుక ఉన్న అసు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
ప్రస్తుతం మొత్తం వ్యవహారం జంతు కొవ్వు ప్రస్తావన చుట్టూ తిరుగుతోంది. సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు గురించి పేర్కొనలేదని, కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలని వైసీపీ వాదిస్తోంది. అయితే ఈ వాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ తీవ్రంగా ఖండించారు. సింథటిక్ నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసిన రసాయనాలను వినియోగించారని, దీనిని మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని వారు మండిపడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి వైసీపీ కొత్త డ్రామాలు ఆడుతోందని, శాస్త్రీయంగా ఆ నెయ్యి నాణ్యత లేదని తేలినప్పుడు, అది అపవిత్రమే అవుతుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రత్యేక చర్చ
త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సభ వేదికగా దోషులను బహిర్గతం చేసి, వారిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేవలం లడ్డూ కల్తీ అంశమే కాకుండా, రాష్ట్రంలో ఇతర రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరుగుతోంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహంతోపాటు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా కొలిక్కి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం పెంచుకుంటూ, పాలనలో వేగం పెంచడమే ఈ సమావేశం ప్రధాన అజెండా కనిపిస్తోంది.
Frequently Asked Questions
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏమిటి?
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎంత మేర నిధుల దుర్వినియోగం జరిగింది?
ఈ నెయ్యి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని, దీని వల్ల శ్రీవారి నిధులు సుమారు 233 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం అయ్యాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ఈ కల్తీ నెయ్యి ఆరోపణలపై ఏమని వాదిస్తోంది?
సిట్ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు గురించి ఎక్కడా పేర్కొనలేదని, కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలని వైసీపీ వాదిస్తోంది.
ప్రభుత్వం ఈ కల్తీ నెయ్యి అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోనుంది?
త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దోషులను బహిర్గతం చేసి, వారిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.






















