Nara Lokesh on Mega DSC 2025 | అమరావతి: ఎంతో బాధ్యతగా తీసుకుని, కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ-2025 నియామకాలు, విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై కీలక ప్రసంగం చేశారు. డీఎస్సీ నియామకాలపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టారు.

Continues below advertisement

టీచర్లను కూటమి విదేశాలకు పంపితే.. వైసీపీ హయాంలో వైన్స్ వద్ద ఉంచారు..

అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు టీచర్ల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వాల హయాంలో మొత్తం 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశాం.  టీచర్లలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు కూటమి ప్రభుత్వం వారిని సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి విదేశాలకు పంపించాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి, వారి గౌరవాన్ని భంగపరిచేలా చేశారని’  విమర్శించారు.

Continues below advertisement

దేశ చరిత్రలో తొలిసారిగా వర్టికల్, హారిజాంటర్ రిజర్వేషన్

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించగా, 336 కేసులు నమోదైనప్పటికీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చర్చ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాలు అత్యంత పారదర్శకంగా జరగడం వల్లే వేలాది మంది టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇందులో భాగంగా వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, విజయవాడలో మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ చేశారని’ మంత్రి లోకేష్  వివరించారు.