- మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం .
- బ్యాటరీ ల నుండి గ్యాస్ లీకై కార్యాలయంలో అవరించిన పొగ
- ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు, ప్రజలు .
- ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది .
- పొగ బయటకు వెళ్లేలా కార్యాలయ అద్దాలు పగలగొట్టిన సిబ్బంది
- ఏటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీల నుండి గ్యాస్ లీక్ కావడంతో కార్యాలయం మొత్తం పొగతో నిండుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు, ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే ఉద్యోగులు, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు చేరుకుని మంటల్ని ఆర్పివేసింది. అంతకుముందే పొగ బయటకు వెళ్లేలా సిబ్బంది కార్యాలయ అద్దాలు పగలగొట్టింది.
మంగళగిరిలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్తలపై ట్రస్ట్ స్పందించింది. స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని, ఎవరికి ప్రమాదం జరగలేదన్నారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అనంతరం ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.