AP Liquor Scam | న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న మద్యం కుంభకోణం (AP Liquor Scam) వ్యవహారంలో ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు, ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేశారు. ఆ రోజున మిథున్ రెడ్డి వ్యక్తిగతంగ విచారణకు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదే కేసులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం తెలిసిదే. కీలక నేతలకు వరుసగా నోటీసులు అందుతుండటంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారుల బృందం వారిని ప్రశ్నించే అవకాశం ఉంది.
కేసు బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం విక్రయాలు, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, నగదు రూపంలో జరిగిన లావాదేవీలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వానికి 3 వేల కోట్లకు పైగా నష్టం వాటల్లిందని, వాటిని వైసీపీ నేతలు దారి మళ్లించి లబ్ది పొందారని ఛార్జ్ షీట్‌లో అధికారులు ప్రాథమికంగా పొందుపరిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడికి మళ్లింది అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. వరుసగా వైసీపీ ఎంపీలకు నోటీసులు అందడంపై అధికార, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా, అవినీతి బయటపడుతోందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది.