Pawan Kalyan VS Raghu Ramakrishna Raju: కూటమి లో అంతా బాగానే ఉన్నట్టు అటు సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కేడర్‌కు సర్ది చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు వాళ్లలో ఉన్న బేదాభిప్రాయాలు చాలా అంశాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఒకే అధికారి అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కూటమిని ఉలిక్కిపడేలా చేసింది అనడంలో అనుమానమే లేకుండా పోయింది.

Continues below advertisement

పవన్ వద్దు అన్న అధికారికి రఘురామ్ కృష్ణం రాజు మద్దతు

భీమవరం డీఎస్పీ జయసూర్యఫై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పేకాట, జూదం లాంటి వాటిని ప్రోత్సహించడంతోపాటు ఎవర్నీ లెక్క చేయడం లేదనేది ఆయనపై ఉన్న ఆరోపణ. దానితో ఆయన్ను గతంలో ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ భీమవరానికి పోస్టింగ్ తెచ్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే (జనసేన ) తన అభిప్రాయానికి కూడా ఈ ఇష్యూలో విలువ లేదనడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ అంశంలో కలుగజేసుకున్నారు. డీజేపీని దీనిపై సమాచారం కోరడంతో వెంటనే రియాక్ట్ అయిన సీఎం, హోంమంత్రి, డీజీపీ సదరు DSPఫై చర్యలు తీసుకున్నారు. హోంమంత్రి అనిత దీనిపై మాట్లాడుతూ కూటమిలో అంతా బానే ఉందని పవన్ ఆ అధికారిఫై స్పందించక ముందే తమ వద్ద సమాచారం ఉందని అందుకే వెంటనే యాక్షన్ తీసుకున్నమని సర్ది చెప్పుకొచ్చారు. 

అయితే ముందుగానే జయసూర్య వ్యవహారంఫై సమాచారం హోంశాఖ వద్ద ఉంటే ఇన్నాళ్లు తనకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇక లేటెస్ట్‌గా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు మాట్లాడుతూ ఆ అధికారి చాలా మంచివాడు అని తనఫై పవన్ కళ్యాణ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని అనడం తీవ్ర సంచలనం సృష్టించింది. అంటే స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)పవన్‌కు తప్పు సమాచారం ఇచ్చారని ఆయన అభిప్రాయమా అన్న విషయం చెప్పనే లేదు. ఒకవేళ  DSP జయసూర్య అంత మంచి అధికారి అయితే కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకుంది అనే దానికీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు. పైగా కొన్ని రకాల పేకాటకు అనుమతి ఉందంటూ ఆయన చెప్పుకు వచ్చారు. ఇప్పుడు అంతా "All is Well" అంటూ చెప్పుకొస్తున్న కూటమి అధినేతల మధ్య రఘు రామ కృష్ణ రాజు మాటలు పెద్ద గందరగోళాన్నే సృష్టించాయి.

Continues below advertisement

పవన్‌కు కోపం రాకుండా చూసుకుంటున్న చంద్రబాబు, లోకేష్ 

ఏపీ రాజకీయాల్ని గమనిస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోందని విశ్లేషకులు అంటారు. అదే 'పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చే ఏ పనీ చంద్రబాబు, లోకేష్ చేయడం లేదు ". పవన్ చెప్పిన ప్రాంతంలో వెంటనే రోడ్లు పడుతున్నాయి. పవన్'లులు'ఫై విమర్శలు చేస్తే వెంటనే చంద్రబాబు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి కందుకూరు బాదితులకు అంతటి ఉదార నష్ట పరిహారం ప్రకటన వెనుక కూడా పవన్ కి ఆ అంశంలో కోపం రాకూడడనే ఆలోచన అనే వాదన ఉంది. పవన్‌కి కోపం వస్తే బీజేపీ అధిష్టానానికి కోపం వచ్చినట్టే అని ప్రస్తుతం టీడీపీ భావిస్తోంది అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అదే టీడీపీ చర్యల్లో స్పష్టంగా కనపడుతోంది.

అయితే కూటమిలోని కింది స్థాయి నేతల్లో ఇది కనపడడం లేదు. తమను లెక్కల్లోకి తీసుకోవడం లేదని టీడీపీ నేతలఫై జనసేన ఎమ్మెల్యే లు, ఇతర నేతలు పదే పదే ఆరోపించినా పవన్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి పవన్‌కు అర్ధం కావడంతో ఆయనే కొన్ని అంశాలఫై సీరియస్ కావడం మొదలు పెట్టారు. ఇది టీడీపీ అధి నాయకత్వాన్ని కాస్త ఆలోచనలో పడేసింది. ఇలాంటి పరిస్థితిల్లో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిఫై పవన్ విమర్శలు చేయడం వెంటనే ప్రభుత్వం స్పందించి అతనిఫై చర్యలు తీసుకోవడం వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు అదే అధికారికి అధికార టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మద్దతుగా మాట్లాడడం కూటమిని ఉలిక్కిపడేలా చేసింది. దీనితో చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్, అనిత లాంటి వాళ్ళు చెబుతున్నట్టు నిజంగా కూటమిలో అంతా "అల్ ఈజ్ వెల్ " అనే మాట నిజమేనా అన్న కొత్త చర్చ ఏపీ ప్రజల్లో మొదలైంది.