అన్వేషించండి

Bill Gates will visit Amaravati: 2 వారాల్లో అమరావతికి బిల్ గేట్స్.. సీఎం చంద్రబాబుతో కీలక భేటీ- పెట్టుబడులకు ఛాన్స్!

Bill Gates will visit Andhra Pradesh | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు.

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్‌ గేట్స్ మరో రెండు వారాల్లో ఏపీకి రానున్నారు. ఫిబ్రవరి 18న బిల్‌గేట్స్ అమరావతికి రానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఏపీ ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో పరస్పర సహకారంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాలలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించడానికి ఇదివరకే ఒప్పందాలు చేసుకుంది. 2025 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ఏఐ టెక్నాలజీ వినియోగంతో పాటు రియల్ టైమ్ డేటా వ్యవస్థలను అమలు చేయడంలో చంద్రబాబు విజన్‌ను బిల్ గేట్స్ ప్రశంసిస్తూ లేఖ సైతం రాశారు. ముఖ్యంగా హెల్త్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..

బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా సాగుతోంది. అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీలో ఈ అంశంపై ప్రతిపాదన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఏపీ ఐటీ రంగానికి ఇది మరింత ప్లస్ అవుతుంది. పలు రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి టెక్నాలజీ సహకారంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన అంశంపై బిల్ గేట్స్ పర్యటన రోజు స్పష్టత రానుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రబాబుకు బిల్ గేట్స్‌తో ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. బిల్ గేట్స్ అభిమానించే నేతలలో చంద్రబాబు ఒకరని తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ అధినేతను సీఎం చంద్రబాబు ఆశ్చర్యపరిచారు. అనంతరం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ రావడానికి ఆ ఘటన కారణమైంది. హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఒక చారిత్రాత్మక అడుగు అది. దేశంలో ఐటీ రంగంలో ముఖ్యంగా హైదరాబాద్ సైతం ఐటీ హబ్‌గా మారేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు ఏపీలోనూ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు చేయనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Advertisement

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
MS Dhoni:'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
'ఎంఎస్ ధోని రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది', మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
లిక్కర్ స్కామ్‌కు అసలు ఆర్కిటెక్ట్ రాజ్ కేసిరెడ్డే - బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Cop elopes with history sheeter : ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!
Embed widget