Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- నవంబర్‌లోపు ఆ పని చేయకుంటే కార్డు రద్దైపోయినట్టే!
Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా లక్షల మంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. వారికి ప్రభుత్వం ఆఖరి గడువు ఇచ్చింది.

Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు ఈకేవైసీ గురించి చెప్పినా ఇంకా లక్షల మంది చేయించుకోలేదు. వారందరికి మరో అవకాశం ఇస్తోంది. నవంబర్ చివరి నాటికి ఈకేవైపీ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈకేవైసీ లేని కార్డులను రద్దు చేస్తామని పేర్కొంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం, పప్పులు, నూనె వంటి వస్తువులు అందిస్తోంది. వీటితోపాటు ఈ కార్డు ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తోంది. వీటన్నింటికి కీలకమైన రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క సభ్యులు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. లేకుంటే వారి కార్డు ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న రేష డీలర్ వద్దకు వెళ్తే వారే ప్రక్రియ పూర్తి చేస్తారని వెల్లడించింది. ఈ పోస్ యంత్రంలో వేలిముద్రలు నమోదు చేసి ఈకేవైసీ పూర్తి చేస్తారని తెలిపింది.
ఇప్పటికే చాలా సార్లు ఈకేవైసీపీ కోసం ప్రజలను అప్రమత్తం చేశారు. అక్టోబర్ ఆఖరి కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. గడువు ముగిసి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు లక్షల కార్డులకు ఈకేవైసీ కాలేదు. అందుకే చివరి ఛాన్స్‌గా ఇప్పుడు మరోసారి గడువు పెంచారు. నవంబర్ చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని చెబుతున్నారు. లేకుంటే వాటిని అనుమానాస్పద కార్డులుగా భావించి వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. తర్వాత అలాంటి కార్డుదారులకు ఏ విధమైన సబ్సిడీ వస్తువులు లభించబోవని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.





















