ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాల పంపిణీకి వెళ్లడం.. ఆపై అసలైన వ్యక్తి రాలేదంటూ సామాన్యుల్ని బలవంతంగా అక్కడే ఉంచడం తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. బాపట్ల జిల్లాలో ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన మహిళలకు చుక్కలు కనిపించాయి. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్దామని ప్రయత్నిస్తే గేట్లకు తాళాలు సైతం వేయడంతో కొందరు అలాగే ఉండిపోగా, మరికొందరు గేట్లు, గోడలు దూకి కార్యక్రమం నుంచి బయటపడ్డారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఆహారం పెట్టలేదు, కనీసం బాత్రూమ్ కు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని దారుణం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అసలేం జరిగిందంటే.. 
బాపట్ల జిల్లా భట్టిప్రోలులో‌ అసరా పథకం చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గం పరిధిలో డ్వాక్ర మహిళలు రావాలని హుకూం జరీ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గెస్ట్ గా స్థానిక శాసన సభ్యుడు మంత్రి మేరుగు నాగార్డున అటెండ్ అవుతారని తెలిపారు. ఎవరు డుమ్మా కొట్టిన పర్యవసానం తీవ్రంగా‌ ఉంటుందని స్థానిక మహిళకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గం పరిదిలోని డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రాంగణం భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ కు డ్వాక్రా మహిళలను మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు.


ఆసరా చెక్కుల పంపిణీకి హాజరైన మహిళలకు భయానక అనుభవం ఎదురైంది. డ్వాక్రా మహిళలకు, కార్యక్రమానికి వెళ్లిన మహిళకు తాగు నీరు కూడా సరిగా అందించదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం అని కూడా చూడకుండా, తమకు కనీస ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. సభ నుంచి వెళ్లిపోదామని ప్రయత్నించిన వారిని గ్రహించి గేట్లకు తాళాలు వేసి లోపలికి పంపించివేశారు. కనీసం బాత్రూమ్ కు వెళ్లేందుకు అయినా అనుమతించాలని కోరినా కార్యక్రమ నిర్వాహకులు అంగీకరించలేదట. డ్వాక్రా మహిళలు మంత్రి మేరుగు నాగార్జున రాక ముందే బయటకు వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో గేట్లు కూడా మూసి వేసి యామినేటర్లను కాపలా పెట్టారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, బాత్రూమ్ కు పంపడం లేదు, బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా గేట్లకు తాళాలు వేశారు. బయటకు వెళ్లే ప్రయత్నం చేసిన మహిళల్ని బెదిరించారని సైతం తెలిపారు. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇక ఉండలేక, ఈ ఇబ్బందులు తట్టుకోలేక కొంత మంది మహిళలు గేట్లు దూకి వెళ్లిపోయారు. ఒంటి గంటలకు కార్యక్రమం అని చెప్పి మహిళలను రప్పించగా.. చివరకు మంత్రి మేరుగు నాగార్జున తీరికగా 5 గంటలకు వచ్చారు అని కొందరు మహిళలు వెల్లడించారు. ఇలాగేనా కార్యక్రమం నిర్వహించేది, అందులోనూ మహిళలపై బెదిరింపులకు పాల్పడటం దారుణం అన్నారు.


ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, చాలా పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు వస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా వస్తారు. కానీ ప్రజల కోసం పాటుపడిన నేత జగన్ అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న వ్యక్తి నేత జగన్, బిడ్డలను స్కూళ్లకు పంపితే తల్లుల ఖాతాల్లో నగదు వేశామన్నారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు.  రైతన్నల కష్టాన్ని చూడలేక నేరుగా ప్రభుత్వం ధాన్యం కొంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ తీసుకొస్తే ఆ తరువాత వచ్చిన సీఎంలు ఎన్నో వ్యాధులకు ట్రీట్మెంట్ తీసేయగా.. జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కొత్త వ్యాధులకు చికిత్స ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.