అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లుగా రూపుదిద్దుకోనున్నాయి. నూతనంగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం ఏపీ ప్రభుత్వం జడ్పీలను మంజూరు చేసింది.

Continues below advertisement

ఈ నూతన జడ్పీల నిర్వహణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం అదనపు పోస్టులను సమకూర్చింది. ఇందులో భాగంగా నూతనంగా 15 జడ్పీ సీఈఓ (CEO) పోస్టులతో పాటు, మరొక 15 డిప్యూటీ సీఈఓ పోస్టుల ఏర్పాటుకు ఆర్థిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24వ తేదీన ముగియనుంది. ఈ పదవీకాలం పూర్తయిన వెంటనే 28 నూతన జడ్పీల వ్యవస్థ అధికారికంగా అమల్లోకి రానుందని తెలుస్తోంది.

 

Continues below advertisement