AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటున నమోదు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏవైనా పొరపాటులు గుర్తిస్తే వాటిని సవరించుకోడానికి గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ వన్‌టైమ్ డిలీట్ అనే సరికొత్త ఫీచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ‌లో పేరు, విద్యార్హతలు, లేదా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఇటువంటి తప్పులు వల్ల భవిష్యత్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును పూర్తిగా డిలీట్ చేసి, సరైన వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టెట్ కన్వీనర్‌ వెంకట్‌ కృష్ణారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

ఈ సవరణ ప్రక్రియ నిరంతరం అందుబాటులో ఉండదు. కేవలం పరిమిత కాలం మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇవాళ్టి (జులై 2) నుంచి ఐదో తేదీ వరకు మాత్రమే అభ్యర్థులు ఈ వన్‌ టైమ్‌ డిలీట్‌ ఆప్షన్‌ు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. 

అభ్యర్థుల అధికారిక టెట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అక్కడ వన్‌టైమ్ డిలీట్‌ అనే ఐచ్చికాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల పాత దరఖాస్తు వ్యవస్థ నుంచి డిలీట్ అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు తాజా వివరాలతో ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తు తిరిగి సబ్‌మిట్ చేయాలి. 

ఈ సవరణ ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దరఖాస్తులో ఆధార్‌ నంబర్‌, మొబై్‌ నంబర్ మినహా మిగిలిన అన్ని అంశాలను(పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, జిల్లా) మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వన్ టైమ్ డిలీట్, తిరిగి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు.అభ్యర్థులు ఉచితంగానే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.