AP Ration Cardholders | అమరావతి: రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండగల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా, డిసెంబర్ నెల నుంచి వరుసగా 3 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు భారీ రాయితీపై సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "మార్కెట్ ఇంటర్వెన్షన్" కార్యక్రమంలో భాగంగా సివిల్ సప్లయిస్ కమిషనర్ కె. కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Continues below advertisement

రాయితీ ధరలలో లభించే సరుకుల వివరాలురాష్ట్రంలోని చౌక ధరల దుకాణాలు (Ration Shops) ద్వారా అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారునికి ఈ సరుకులను చౌకగా అందించనున్నారు.

కందిపప్పు: కిలో రూ. 100

Continues below advertisement

పామాయిల్: లీటరు రూ. 125

గోధుమ పిండి: కిలో రూ. 25

ఈ ధరలకు రాయితీపై నిత్యావసరాలను నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు.

ప్రభుత్వంపై పడనున్న ఆర్థిక భారం

ఈ పండుగ కానుక ద్వారా రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కొనుగోలుతో ధరల భారం నుంచి ఉపశమనం లభించనుంది. 3 నెలల పాటు ఈ రాయితీ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా అందించడానికిగాను కూటమి ప్రభుత్వంపై రూ. 300.60 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ నిధులను వెచ్చించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసింది.