అన్వేషించండి

Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్

AP FDC Directors : ఏపీ FDC ఛైర్మన్ సహా కొత్తగా డైరెక్టర్స్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నటులు సుమన్, శివాజీష ఝాన్సీ సహా డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇచ్చింది.

AP Governments Appoints FDC Directors : సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అవార్డుల నిర్వహణ, టీవీ నాటక రంగాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొత్త రూపు తీసుకొచ్చింది. FDC (Film Development Corporation)కు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా 20 మంది డైరెక్టర్లను నియమించింది. ప్రముఖ డైరెక్టర్స్, నిర్మాతలు సహా నటులకు ఇందులో అవకాశం కల్పించారు.

ఛైర్మన్‌గా ఫేమస్ డిస్ట్రిబ్యూటర్

ఏపీ FDC ఛైర్మన్‌గా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్‌ను ఛైర్మన్‌గా నియమించింది. అలాగే, వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్‌ను నియమించారు. అయితే, FDCలో ఆ పదవి లేకపోవడంతో ఆయన కూడా డైరెక్టర్‌గానే కొనసాగనున్నారు. ఇక వీరితో పాటే 20 మంది డైరెక్టర్స్‌ను అపాయింట్ చేస్తూ జీవో జారీ చేసింది. వీరంతా సినిమా రంగంలో వివిధ శాఖలకు చెందినవారే.

గతంలో FDC డైరెక్టర్లుగా 15 నుంచి 20 మందిని నియమించినా... అందులో ఎక్కువ మంది సినీ రంగానికి సంబంధం లేని వాళ్లు ఉండేవాళ్లు. ఆ పద్ధతిని పక్కన పెడుతూ ఈసారి మొత్తం సినీ రంగానికి చెందిన వారినే డైరెక్టర్లుగా నియమించింది ప్రభుత్వం.

FDC డైరెక్టర్స్ వీళ్లే...

ఛైర్మన్ - భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్ - డైరెక్టర్ మెహర్ రమేష్

డైరెక్టర్స్ - ప్రముఖ నటులు శివాజీ, సుమన్, ఝాన్సీలకు FDC డైరెక్టర్స్‌లో చోటు దక్కింది. అలాగే, సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు, కూచిభొట్ల సుబ్రమణ్యం, రచయిత సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సముద్ర, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్ ఎస్.మీర్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు.

అలాగే, నాటక రంగానికి చెందిన కందిమళ్ల సాంబశివరావు, ఎగ్జిబిటర్స్ ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, వైజాగ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత డి.సత్యనారాయణలను నియమితులయ్యారు. వీరితో పాటే ముగ్గురు  ప్రభుత్వ అధికారులు కూడా డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తారు.

Also Read : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్

డైరెక్టర్స్ ప్రమాణం

APFDC చైర్మన్ సహా ఇతర డైరెక్టర్స్ అంతా విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని FDC కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత వీరంతా సీఎం చంద్రబాబును కలిశారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూచనలతో FDCని బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గద్దర్ అవార్డ్స్ ఇస్తుండగా... ఏపీలోనూ నంది అవార్డ్స్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

FDC ఛైర్మన్, డైరెక్టర్స్ నియామకంతో ఏపీలో సినీ రంగం బలోపేతం కావడం సహా నంది అవార్డ్స్ పునరుద్ధరణలోనూ ముందడుగు పడే ఛాన్స్ ఉందని సినీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు, తెలంగాణలో FDC ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రమే కంటిన్యూ అవుతుండగా... డైరెక్టర్లను నియమించలేదు. 

Also Read : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
AP, Telangana Rain Alert: ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
Pawan Kalyan Interview Highlights: నారా లోకేష్‌తో ఇబ్బంది వల్లే తెలంగాణకు వెళ్తున్నారా? ANI ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సంచలన సమాధానం!
నారా లోకేష్‌తో ఇబ్బంది వల్లే తెలంగాణకు వెళ్తున్నారా? ANI ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సంచలన సమాధానం!
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Hyderabad Crime News: భార్యపై అనుమానం.. గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి మరీ కాల్చి చంపేసిన భర్త- హైదరాబాద్‌లో దారుణం
భార్యపై అనుమానం.. గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి మరీ కాల్చి చంపేసిన భర్త- హైదరాబాద్‌లో దారుణం
Hardik Pandya Ruled Out: నిన్ననే క్లియరెన్స్, మళ్లీ తిర‌గ‌బెట్టిన‌ గాయం.. ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం!
నిన్ననే క్లియరెన్స్, మళ్లీ తిర‌గ‌బెట్టిన‌ గాయం.. ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం!
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Maruti Suzuki Offers Price Protection: మారుతి కార్లు కొనాలనుకునే వారికి సూపర్ చాన్స్, ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం!
మారుతి కార్లు కొనాలనుకునే వారికి సూపర్ చాన్స్, ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం!
Embed widget