అన్వేషించండి

AP CM Chandrababu: రెండేళ్లలో ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లు: సీఎం చంద్రబాబు

Amaravati Quantum Valley | అమరావతిలోని క్వాంటం వ్యాలీ నుంచి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతి: సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ అనవసరమని, అట్టడుగు వర్గాల పేదలను ఆదుకోవడానికి ఇవి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పథకాలు అందించడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమేనని అధికారులకు సూచించారు. మరో 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి జీఎస్‌డీపీ (GSDP) వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా ఏఐ (AI) టూల్స్ వినియోగం, డేటా భద్రత, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లు

రాబోయే రోజుల్లో సాంకేతిక రంగంలో రానున్న మార్పులను ప్రస్తావిస్తూ, అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ విప్లవం రాబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లలో ఇక్కడి నుంచే క్వాంటం కంప్యూటర్లు తయారై ప్రపంచానికి సరఫరా అవుతాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్ల ద్వారా రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందని, ఈ క్రమంలో కలెక్టర్లు, ఇన్-ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాలనలో ఏఐ (AI) అప్లికేషన్ల వినియోగాన్ని పెంచుతూ, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మరియు ఇన్-ఛార్జ్ మంత్రులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఏపీలో గత 19 నెలల పాలనపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఎదుర్కొన్న అంధకారం నుంచి బయటపడి, ప్రస్తుతం వ్యవస్థలన్నీ తిరిగి గాడిన పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతిపై నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా పయనిస్తున్నామని స్పష్టం చేశారు.

సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సూపర్ సిక్స్' పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని సీఎం పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాలను ఆయన వివరించారు: తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ. 10,000 కోట్లు జమ చేమచేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటివరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. 

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు రూ. 6,310 కోట్ల ఆర్థిక సాయం అందించడమే కాకుండా, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, కోస్తాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల రూపంలో రూ. 58,000 కోట్లు, దీపం 2.0 పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు వివరించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget