అన్వేషించండి

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి

BC Reservations In Andhra Pradesh | ఏపీలో నవంబర్ 15 నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, నవంబర్ 15 గడువు.
  • బీసీ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం, స్థానాలు పెరిగాయి.
  • దాదాపు 38 వేల బీసీలకు పదవులు, 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి.

AP Cabinet Decisions | అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కేబినెట్ భేటీలో బీసీలకు రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపులపై కీలకంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇంఛార్జ్‌ మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం కానుందని తెలుస్తోంది. ఈ నెల 14 లేదా 15న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 3 దశలలో నవంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. 

కేబినెట్ భేటీ ముగిసిన తరువాత  మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నవంబర్‌ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి, రెగ్యులర్‌ పాలన వచ్చేలా చూద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100శాతం గెలవాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని, చురుకుగా వ్యవహరిస్తూ వారి విజయం సాధించేలా చూసుకోవాలని సూచించారు. 


CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి

బీసీల రిజర్వేషన్లపై భరోసా

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ, వారి రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెడికేటెడ్ బీసీ కమిషన్ (రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్) సమర్పించిన నివేదిక, సిఫార్సులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిర్ణయం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లభించే స్థానాలు పెరగనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో కేవలం 33 వేల మంది బీసీలకు మాత్రమే అవకాశాలు దక్కగా, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు 38 వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులకు పదవులు దక్కనున్నాయి. బీసీలకు గతంలో కంటే సుమారు 4 వేలకు పైగా స్థానాలు రగనున్నాయి.

జిల్లాలు, వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు పెంపును పరిగణనలోకి తీసుకుని, జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు మినహా ఇతర అన్ని విభాగాల పరిధిలోని దాదాపు 1.40 లక్షలకు పైగా స్థానాల్లో బీసీ రిజర్వేషన్లను వర్తింపజేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. స్థానిక చట్టాలు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండానే బీసీలకు గరిష్ట స్థానాల్లో పోటీ చేసేలా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. 


CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి

Also Read: Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ

రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సీట్లు కేటాయింపు

అంతేకాకుండా, సుప్రీంకోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకుండా డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా న్యాయపరమైన చిక్కులు రాకుండా పక్కాగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఏవైనా కేటగిరీలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం కంటే తక్కువగా ఉంటే, కూటమి పార్టీల తరఫున ఆయా పదవులను బీసీలకే కేటాయిస్తామని చంద్రబాబు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Frequently Asked Questions

స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?

నవంబర్ 15 నాటికి స్థానిక ఎన్నికలను పూర్తి చేసి, సాధారణ పాలన వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కూటమి అభ్యర్థులు 100 శాతం గెలవాలని ఆకాంక్షించారు.

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంది?

డెడికేటెడ్ బీసీ కమిషన్ (రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్) నివేదిక, సిఫార్సులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల బీసీలకు లభించే స్థానాలు గణనీయంగా పెరుగుతాయి.

కొత్త నిర్ణయం వల్ల బీసీలకు ఎన్ని స్థానాలు అదనంగా లభించనున్నాయి?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 33 వేల మంది బీసీలకు అవకాశం దక్కగా, ప్రస్తుత నిర్ణయంతో 38 వేల మందికి పైగా పదవులు లభిస్తాయి. అంటే, దాదాపు 4 వేలకు పైగా అదనపు స్థానాలు దక్కుతాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ల శాతం ఎంతకు మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది?

సుప్రీంకోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు అనుగుణంగా, మొత్తం రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు ! నారా లోకేష్ తో కంపెనీ ప్రెసిడెంట్ భేటీ
ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడులు ! నారా లోకేష్ తో కంపెనీ ప్రెసిడెంట్ భేటీ
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Embed widget