అన్వేషించండి

AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?

AP Budget 2026 Updates : రాష్ట్రంలో కీలక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పయ్యావుల కేశవ్ చెప్పారు. అందులో మొదటిది వ్యసాయం అయితే రెండోది సాగునీటిపారుదల రంగమని పేర్కొన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన వార్షిక బడ్జెట్‌ 2026-27ను సభలో  ఆర్థికమంత్రి పయ్యావుల ప్రవేశ పెట్టారు. ఇది కేవలం అంకెలతో కూడిన లెక్కల పత్రం కాదని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ఒక ఆశల వారధి అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో స్వర్ణాంధ్ర @2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌ రూపొందించారు. 

మొత్తం 3,32, 205 కోట్ల భారీ వ్యయంతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతూనే, సంక్షేమం , అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. 

బడ్జెట్‌ను అంకెల్లో చూస్తే  

  • మొత్తం బడ్జెట్‌ వ్యయం- 3,32, 205 కోట్లు 
  • రెవెన్యూ వ్యయం- రోజు వారి ఖర్చుల కోసం 2, 56, 143 కోట్లు కేటాయించారు. 
  • మూలధన వ్యయం(ఆస్తుల సృష్టి)- 53, 915 కోట్లుగా చెప్పారు. 
  • రెవెన్యూ లోటు- 22, 002కోట్లు ఇది జీఎస్‌డీపీలో 1.11శాతంగా ఉంది.
  • ఆర్థిక లోటు - 75, 868 కోట్లు. ఇది కూడా జీఎస్డీపీలో 3.84 శాతంగా ఉంది. 

భవిష్యత్‌ భరోసార కోసం ఏపీ వెల్త్‌ ఫండ్‌

ఈ బడ్జెట్‌లో అత్యంత వినూత్నమైన అంశం ఏపీ వెల్త్‌ ఫండ్‌ ఏర్పాటు . నార్వే, అబుదాబి వంటి దేశాల్లో ఉన్న సావరినిటీ ఫండ్‌ తరహాలోనే ఏపీ రాష్ట్రానికి సొంతంగా ఒక నిధిని సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రాథమికంగా 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఆస్తులను అభిృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సంపదను సృష్టించి, ఆ లాభాలను మళ్లీ ప్రజల అభివృద్ధి కోసం వాడటం కోసం ఈ ఫండ్‌ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. 

సాగు నీటికి ఇచ్చిన నిదులు ఇవే

రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నట్టు పయ్యావుల తెలిపారు. ప్రకృతిపై ఆధారపడి వ్యసాయం చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తున్నందున నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలిపారు. నీటి ప్రాజెక్టు కట్టడమే కాకుండా దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా విధానాలు రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. అందుకే ఈ బడ్జెట్‌లో ఈ రంగానికి 18,224 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 

రైతుల స్థిరీకరణ నిధికి పెరిగిన నిధులు 

గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీగా కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదన్నారు. 2019-24 మధ్య కాలంలో 7,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా కేవలం 880 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం  ధర స్థిరీకరణ నిధికి 300 కోట్లు మాత్రమే కేటాయించినా 1200 కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సహకార రంగానికి సహకారం 

పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు పని చేస్తుందన్నారు. మూడు అంచెల సహకారంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని ఇస్తున్నామని అన్నారు. గత ఈ ఆర్థిక సంవత్సరంలో 52.2 లక్షల మంది సభ్యులకు 7600 కోట్లకుపైగా వ్యవసాయ రుణాలు ఇచ్చామని తెలిపారు. 2026-27 బడ్జెట్‌లో 13, 598 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు.                     

Frequently Asked Questions

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత?

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం 3,32,205 కోట్ల రూపాయలు.

ఏపీ వెల్త్ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేశారు?

రాష్ట్రంలోని ఆస్తులను అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సంపదను సృష్టించి, ఆ లాభాలను ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించడం ఈ నిధి ముఖ్య ఉద్దేశ్యం.

వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?

రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, నీటి నిల్వ మరియు సమర్థ పంపిణీపై దృష్టి సారించి, ఈ రంగానికి 18,224 కోట్లు కేటాయించారు.

రైతుల స్థిరీకరణ నిధికి ఎంత కేటాయించారు?

గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తంలో, ఈ బడ్జెట్‌లో రైతుల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఫ్టైట్‌లో మంత్రి గొట్టిపాటి, ఇద్దరు ఎమ్మెల్యేలు
Bihar IPS Sunil Naik: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
Dhulipalla Narendra: పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు, వైసీపీ ఇకనైనా తప్పు ఒప్పుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Embed widget