పవన్ కల్యాణ్ స్పీచ్ మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ చేసే ఉడత ఊపులకు భయపడేది వైఎస్ఆర్ సీపీ కాదని అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారాహి అనే అమ్మవారి వాహనం పేరు పెట్టుకొని దానిపైకి ఎక్కి పిచ్చి వాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు ఓడిపోయిన పవన్ కల్యాణ్, అమ్మవారి శాపంతో మళ్లీ ఓడిపోతారని అన్నారు. తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.
వైఎస్ జగన్ రెక్కల కష్టం మీద పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఎవరిదగ్గరో పార్టీని లాక్కోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడబలుక్కొనే వ్యాఖ్యలు చేస్తున్నారని, సత్యహరిశ్చంద్రుల్లా కలరింగ్ ఇస్తూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.
‘‘దిగజారి మాట్లాడే పవన్ రాజకీయాలకు అస్సలు పనికి రాడు. షూటింగ్ బ్రేక్స్‌లోనే ఆయన ఆంధ్రాలో అడుగు పెడతారు. ఏపీలోనే ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పగలరా? దమ్ముంటే ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పగలడా? తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కల్యాణ్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌కు ఎవరి మీద అనుమానం ఉందో కచ్చితంగా చెప్పి తీరాలి. నిజంగా ప్రాణహాని ఉంటే ప్రభుత్వానికి సాక్ష్యాధారాలు ఇవ్వాలి. ప్రాణహాని ఉంటే పోలీసులకు కంప్లైంట్ ఎందుకు చేయలేదు’’
క్లారిటీలేని పార్టీ జనసేన, పవన్ ఓ పిరికి పంద. చంద్రబాబుకు మద్దతు పలకడానికి పుట్టిందే జనసేన పార్టీ. జనసేనను ఉంచుతాడో, మూసేస్తాడే పవన్ కల్యాణ్ కే తెలీదు. చంద్రబాబును సీఎంగా చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ లక్ష్యం నెరవేరే అవకాశమే లేదు. ఆయన మాటలు నమ్మి యువత మోసపోకండి. పవన్ పిచ్చి చేష్టలకు పిల్లలను బలి చేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా’’
శ్రీవాణి ట్రస్టుపైనా అంబటి స్పందన
‘‘శ్రీవాణి ట్రస్టు గురించి చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారు. తిరుమలలోని శ్రీవాణి ట్రస్టులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. ఇక ముందు జరిగే ప్రసక్తి లేదు. పవన్ కల్యాణ్ చెప్పులు పొగొట్టుకున్నట్లు బట్టలు కూడా పొగొట్టుకుంటాడు. కేవలం అండర్ వేర్ తోనే కనిపిస్తాడు. ఎమ్మెల్యే ద్వారంపూడిని కొడతానని అంటున్నాడు. పవన్ కల్యాణ్ అంత మగాడివా? పవన్ రాజకీయం చేస్తున్నారా? రౌడీయిజం చేస్తున్నారా?’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.