(Source: ECI | ABP NEWS)
Amaravati Farmers Problem: కూటమి ప్రభుత్వంఫై అమరావతి రైతుల అసంతృప్తి.. ఆ ముగ్గురిదే బాధ్యత అన్న చంద్రబాబు
AP CM Chandrababu | కూటమి ప్రభుత్వంఫై అమరావతి రైతులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సమస్య పరిష్కారం కోసం ముగ్గురికి బాధ్యత అప్పగించారు.

CRDA office In Amaravati | ఒకపక్క అమరావతి లో తొలి శాశ్వత కార్యాలయం CRDA బిల్డింగ్ ని సీయం ప్రారంభిస్తే.. అదే సమయం లో అమరావతి రైతులు తొలిసారి ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వానికి బహిరంగంగా తమ డిమాండ్లు వినిపించారు.ఇప్పటివరకు తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాము కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. Crda కార్యాలయ ప్రారంభ సమయంలో అమరావతి రైతుల అసంతృప్తి ఇప్పుడు సంచలనం అయ్యింది.
ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై గుంటూరులో జరిగిన అమరావతి రైతు జెఎసి సమావేశం వివరాలు, తీర్మానాలు
ప్రభుత్వం అమరావతి రైతుల సమస్యను పట్టించుకోవడం లేదనీ, crda లో అవినీతి పెరిగిందని తీర్మానించారు.పది రోజుల్లో ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.వారి డిమాండ్స్ ఏమిటంటే..
1.నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ అనేక సమస్యలు అనగా రైతులకు సంబంధించి పరిష్కరించబడలేదు.
2.అనేకసార్లు సిఆర్‌డిఏ అధికారులు మరియు గౌరవ మున్సిపల్‌శాఖ మంత్రి వర్యులకు వినతిపత్రములు మరియు, గ్రీవెన్స్ సదస్సులలోనూ, వారి దృష్టికి తీసుకువచ్చినా నేటి వరకూ పరిష్కారం కాలేదు.
3.అసైన్డ్ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్దీకరణ, రోడ్డుపోటు ప్లాట్ల సమస్య, మరియు, ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, మరియు అసంబద్ధమైన ఎఫ్‌ఎస్‌ఐ విధానం, మరియు ఇతర సమస్యల పట్ల అధికారుల మరియు ప్రభుత్వ అలసత్వ ధోరణి, మరియు క్రిందిస్తాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు.
4.నూతన ప్రభుత్వం యొక్క అమరావతి అభివృద్ధి కార్యక్రమములలో లోపించిన రైతుల భాగస్వామ్యము, మరియు స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు.
5.అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి)పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువల్ల గుంటూరులో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిపి ఈ దిగువ తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి.

డిమాండ్లు
1. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్‌శాఖ మంత్రి, సంబంధిత ప్రజాప్రతినిధులు రైతు జెఎసితో రానున్న పదిరోజుల్లో అనగా వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయవలసినదిగా డిమాండు చేస్తున్నాము.
2.రైతు సమస్యలు పరిష్కారం గురించి చర్చించి కాలవ్యవథిని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా డిమాండు చేస్తున్నాము
3.ప్రతి రెండు నెలలకు రైతు జెఎసితో సంయుక్త సమావేశం జరపాలని ఆ సమావేశంలో పురోగతిని సమీక్షించాలని కోరుతున్నాము
4.పై డిమాండ్లపై ప్రభుత్వ స్పందన వెంటనే లేని ఎడయ భూ సమీకరణకు భూమి ఇచ్చిన రైతులు, రైతు కూలీల విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించాలని తీర్మానించారు.

ఆ ముగ్గురిదే బాధ్యత : సీఎం చంద్రబాబు
CRDA బిల్డింగ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి రైతుల ఆందోళన ఫై స్పందించారు.రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామన్న సీయం రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలి అనీ రైతులతో నిరంతరం మాట్లాడుతూ వారి సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతను ఈ ముగ్గురు తీసుకుంటారనీ అప్పటికీ పరిష్కారం కాని సమస్యలేమైనా ఉంటే తాను బాధ్యత తీసుకుంటాననీ ఆయన అన్నారు. త్వరలోనే భూములిచ్చిన రైతులతో సమావేశమవుతానన్న ముఖ్యమంత్రి అమరావతి రైతుల అసంతృప్తిని ఎలా తీరుస్తారో చూడాలి.





















