AP Minister: ఈ ఫొటోలో ఉన్న ఏపీ మంత్రి ఎవరో గుర్తు పట్టారా?
సినిమాల్లో నటించినట్లుగా ఉన్న అంబటి రాంబాబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటుడా అని జనం ఆశ్చర్యపోతున్నారు.
అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పూర్వశ్రమంలో ఏం చేసేవారు. ఆయన మొదట రాజకీయ నాయకుడు. బతకడానికి ఏమైనా వ్యాపారాలు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మంత్రి ( Minister ) అయ్యారు. అంత వరకూ ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన ప్రెస్‌మీట్‌లు చూస్తే.. ఆ వాచకం.. ఆ అభినయం .. అన్నీ పరిశీలిస్తే అన్ని వేరియేషన్స్ చూపించడం నటుల వల్లే సాధ్యమవుతుందే అనుకోని వారు ఉండరు. ఆయన కు సినిమా ఇండస్ట్రీలో ( Film Industry ) సన్నిహితులు ఉన్నారని చాలా మందికి తెలుసు. జీవిత, రాజశేఖర్ లు కాంగ్రెస్ పార్టీ ( Congress ) తరపున ప్రచారం చేయడానికి .. తర్వాత వైఎస్ఆర్‌సీపీలో ( YSRCP ) చేరడానికి అంబటి రాంబబే కారణం అని చాలా సార్లు చెప్పారు. అంత వరకూ బాగానే ఉన్నా... అంబటి రాంబాబు కూడా సినీ పరిశ్రమలోనే వ్యక్తే అని చాలా మందికి తెలియదు. నమ్మలేరు కూడా.
మంత్రి పదవి రాలేదని ఫీల్ అయ్యా- రాజీనామాపై బాలినేని క్లారిటీ
అంబటి రాంబాబు కూడా కళాకారుడే. ఆయనకు సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన నటుడు ( Actor Rambabu ) కూడా ఏ సినిమాల్లో నటించారో.. ఏ సీరియల్స్‌లో నటించారో చాలా మందికి తెలియదు. కానీ ఆయన నటించిన కొన్ని సన్నివేశాల తాలూకా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి ఇప్పటివి కావు. వయసులో ఉన్నప్పటివి. కాస్త పట్టి పట్టి చూస్తేనే కానీ అవి అంబటి రాంబాబు ఫోటోలు అని అర్థం చేసుకోలేం. ఎందుకంటే మేకప్‌లో కూడా ఉన్నారు మరి.
ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్న పవన్ కల్యాణ్, రేపు అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర
అంబటి రాంబాబు కళాకారుడేనని ( Artist ) ఈ ఫోటోలతో మరోసారి నిరూపితమైది. అయిన తన వయసులో ఉన్నప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో నటించారేమో ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇలాంటి వీడియోలు.. ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతనే అంబటి రాంబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎన్ని సినిమాల్లో నటించారు.. ఏఏ సినిమాల్లో నటించారు అన్నది. బహుశా.. అవి విడుదలై ఉండకపోవచ్చని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే విడుదైతే.. ఎలాగోలా తెలిసిపోయేవి కదా అన్నది వారి లాజిక్.
బాలినేని బాధ్యతలు పెద్దిరెడ్డికి - తానేటి వనితకు హోం, ఆ ఇద్దరి శాఖలు ఎక్స్చేంజ్