AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. వీరిలో
పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడు ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. మిగిలిన సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
మంగళవారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా .. జగన్ ఆలస్యంగా వచ్చారని .. ఆయన కోసం గవర్నర్ వేచి చూశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేశవ్ వ్యాఖ్యల్ని ఓ పత్రిక ప్రచురించింది. అలా జరగలేదని పయ్యావుల తప్పుడు ఆరోపణలు చేశారని ప్రివిలేజ్ మోషన్ ను అధికార పార్టీ సభ్యులు ప్రవేశ పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు ని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ముందుగా ఎలాంటి తీర్మానం లేకుండా నేరుగా సస్పెండ్ చేశారు. ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించడంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరలా వీరిద్దరి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని... వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
సస్పెండ్ అయిన వారిలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు ఉన్నారు. వీరితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తన నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. కోటంరెడ్డిపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ షెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ నిర్ణయం స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.