Bangalore Rave Party Case Andhra Politcs :   బెంగళూరు రేవ్ పార్టీ కేసుపై ఏపీలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది.  రేవ్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్‌ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో అరుణ్‌ ఏ2గా ఉన్నాడు. బర్త్‌ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్‌ ముఖ్య అనుచరుడు. సొంతూరు మాత్రం తవణంపల్లె మండలం మడవనేరి గ్రామం. అరుణ్‌ కుమార్‌ బెంగళూరులో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు.   అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.


అరుణ్‌కుమార్‌ సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్‌ను సన్మానిసున్న, రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేసుకున్నారు. ‘‘దేశంలో ఎక్కడ అక్రమం జరిగినా దాని లింకు వైసీపీతో ఉండాల్సిందే. అందులోనూ డ్రగ్స్‌ వ్యవహారం అయితే తప్పనిసరి. బెంగళూరు రేవ్‌ పార్టీ నిందితుల్లో ఏ-2 అరుణ్‌ ఎవరో కాదు.. సజ్జల భార్గవ్‌కి రైట్‌ హ్యాండ్‌’’ అని అరుణ్‌కుమార్‌ గురించి టీడీపీ ఆరోపణలు చేసింది. 


 





 
ఇంతకు ముందు ఫామ్ హౌస్‌లో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు దొరికింది. ఆ కారులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాస్ పోర్టు దొరికిందన్న ప్రచారమూ జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. ఈ వివాదం సద్దుమణగక ముందే అరుణ్ కుమార్ వ్యవహారం తెరపైకి వచ్చింది.  మరో వైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగగళూరులోని బీఆర్‌ ఫామ్‌ హౌస్‌ యజమాని గోపాల్‌ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు.  రేవ్‌ పార్టీపై పోలీసులు దాడుల  అ‍క్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి  పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ను ఈయన కారుపైనే ఉన్న్లుగా గుర్తించారు.                                                      


బెంగళూరు రేవ్‌ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ తీసుకున్న వారిలో టాలీవుడ్‌ నటి హేమా, ఆషీరాయ్‌ కూడా ఉన్నారు. వీరి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది.