ACB Court Judge Himabindu: స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసుతో ఏపీ మొత్తం హీటెక్కిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటి నుంచి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. చంద్రబాబును జైలుకు పంపించారన్న కోపంతో జడ్జి హిమబిందును కించపరుస్తూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన నంద్యాల పోలీసులు... జడ్డి హిమబిందుపై పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఆయన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ అని పోలీసులు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన ఖాజా హుస్సేన్ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈరోజే ఇతడిని కోర్టులో హాజరు పరచబోతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాను కావాలని సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవిలో ఉండే ఈ అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ముల్లా ఖాజా హుస్సేన్ ఒప్పుకున్నారు. 


కావాలని జడ్జిలతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు


మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ చేయడంపై ఏపీ సర్కారు.. హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏపీ శ్రీరామ్... ఉద్దేశ పూర్వకంగానే ప్రచారం జరిగిందని, జడ్జిలను వాల్ల కుటుం సభ్యులను కూడా ట్రోలింగ్ చేశారని, కావాలనే అసభ్య పోస్టులు పెట్టారని అన్నారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించిన నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్ధా వెంకన్నతో పాటు షోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేయనున్నారు.


ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్రపతి భవన్


ఇటీవలే జడ్జిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని సదరు లేఖలో పేర్కొన్నారు.


Read Also: ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !


మరోవైపు చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా


చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ దూబే, సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అంతకు ముందు ఐదో తేదీకి వాయిదా వేస్తామని న్యాయమూర్తి చెప్పారు.అయితే ఇప్పుడే వాదనలు వినాలని ఏఏజీ పొన్నవోలు సధాకర్ రెడ్డి పట్టుబట్టడంతో మళ్లీ వాదనలు విన్నారు. తర్వాత నాలుగో తేదీకి వాయిదా వేశారు. చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్‌లపై కూడా అదే రోజు విచారణ జరుపుతామని ఏసీబీ కోర్టు తెలిపింది.